షానే క‌మ‌ల ద‌ళ‌ప‌తి ..పార్టీకి ర‌థ‌సార‌థి

ఊహాగానాల‌కు తెర దించారు. తిరిగి అమిత్ షానే పార్టీకి ద‌ళ‌ప‌తి అంటూ స్ప‌ష్టం చేశారు..భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజి. ఆయ‌న స్థానంలో వేరే వారికి అప్ప‌గిస్తార‌నే ప్ర‌చారం పార్టీలో జోరందుకుంది. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ బాధ్యులు ..పీఎంతో సీరియ‌స్‌గా చ‌ర్చించారు. మోదీకి కుడి భుజంగా, నెంబ‌ర్ టూగా ఉంటూ వ‌చ్చారు. ఎక్క‌డ‌లేని ప్ర‌యారిటీ షాకు ఇవ్వ‌డంపై పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు గుర్రుగా ఉండ‌డం, మోదీపై విమ‌ర్శ‌లు చేసేందుకు సైతం వెనుకాడ‌లేదు. కానీ సీన్ మారింది. ఫీనిక్స్ ప‌క్షిలాగా ఎక్కడా తొట్రు ప‌డ‌లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రెండోసారి దేశ వ్యాప్తంగా థంబింగ్ మెజారిటీని పార్టీకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త మాత్రం వీరిద్ద‌రిదే. 

మోదీ కెప్ట‌న్‌గా వుంటే ..వైస్ కెప్టెన్‌గా అమిత్ షా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. అటు పార్టీని చాప కింద నీరులా విస్త‌రించేలా చేయ‌డంలో షా చేసిన కృషి చెప్పుకోత‌గ్ద‌ది.
క‌మ‌లానికి రెండో సారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంతో అమిత్ షా పార్టీ అధ్య‌క్షుడిగా స‌క్సెస్ అయ్యారు. ఇక ఆయ‌న మాట‌కు తిరుగు లేకుండా పోయింది. ఏ ఒక్క నేత కూడా పార్టీకి, మోదీ టీంకు వ్య‌తిరేకంగా మాట్లాడే ప‌రిస్థితులు ఇపుడు లేవు. దీంతో సీనియ‌ర్ దిగ్గ‌జాలు అద్వానీ, రాజ్ నాథ్ , లాంటి వారంతా మౌనంగా వుండి పోయారు. ఎక్క‌డికి వెళ్లినా మోదీ, షాలే క‌నిపిస్తున్నారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు క‌ల్పించ‌డంలో, ప‌క్కా ప్ర‌ణాళిక‌ను త‌యారు చేసి వ‌ర్క‌వుట్ చేయ‌డంలో షా చేసిన మంత్రాంగానికి అపార రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన మోదీ..త‌న‌కు తానుగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. 

ఏ పార్టీపైన ఆధార ప‌డ‌కుండానే స్వంతంగా బీజేపీ కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో షానే కింగ్ మేక‌ర్‌గా అవ‌త‌రించారు. త‌న‌కు కుడి భుజంగా వుంటూ..పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డ‌మే కాకుండా భారీ మెజారిటీని సాధించి పెట్టిన అమిత్ షాకు కీల‌క‌మైన హోం శాఖ మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఒక‌రికి రెండు ప‌ద‌వులు ఉండ‌రాద‌నే పార్టీ నియ‌మంతో షా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుండి వైదొలుగుతార‌ని పార్టీ శ్రేణులు, నాయ‌కులు భావించారు. కానీ దానికి పూర్తిగా చెక్ పెట్టేశారు మోదీజి. బీజేపీ అంటేనే నేత‌ల స‌మూహం కాదు..మోదీ అండ్ షా. వీరిద్ద‌రే కీల‌కం..వీరే స‌ర్వ‌స్వం. వీరు ఎవ‌రిని సిఫార‌సు చేస్తే వారికి బాధ్య‌త‌లు ద‌క్కుతాయి. 

ప‌ద‌వులు చెంత‌న వాలిపోతాయి. పార్టీకి చెందిన వారంతా షా చుట్టూ తిరుగుతున్నాయి. క‌మ‌ల రాజ‌కీయాల‌న్నీ షాను జ‌పిస్తున్నాయి. అంతేకాకుండా ..ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న హరియాణా, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఆయనే పర్యవేక్షించనున్నారు. ఆ తర్వాత అంటే, వచ్చే ఏడాది ఆరంభంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. బీజేపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి. ప్ర‌స్తుతానికి షానే కింగ్ మేక‌ర్‌గా ఉండ‌బోతున్నారు. మిగ‌తా వారంతా చూస్తూ వుండ‌ట‌మే చేయ‌గ‌లిగింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!