వేత‌న జీవుల్లో సంజీవ్ వేర‌యా - సీఎండీనా మ‌జాకా ..!

ఎవ‌రీ సంజీవ్ పురి అనుకుంటున్నారా. ఆయ‌న గురించి చెప్పాలంటే ఓ పెద్ద క‌థ వుంది. ఇండియ‌న్ టొబాకో కంపెనీకి ఛైర్మ‌న్‌గా, చీఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. భార‌త దేశంలో అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్ గా ..కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని గ‌డించిన కంపెనీగా మార్చ‌డంలో ఈ ఐఐటీయ‌న్ పాత్ర చెప్పుకోద‌గ్గ‌ది. ప్ర‌పంచం విస్తు పోయేలా ..కంపెనీల అధిప‌తులు ఆశ్చ‌ర్య పోయేలా సంజీవ్ పురి చ‌రిత్ర సృష్టించారు. ఒక‌ప్పుడు సంస్థ‌ను మూసి వేయాల‌ని నిర్ణ‌యించుకున్న స‌మ‌యంలో పురితో పాటు అంత‌కు ముందున్న ఛైర్మ‌న్ అహోరాత్రులు శ్ర‌మించారు. ఈ కంపెనీకి జీవం పోశారు అన‌డం కంటే ప్రాణం పెట్టారు అని చెప్ప‌వ‌చ్చు. మోస్ట్ మెమోర‌బుల్ సిఎండిగా ఆయ‌న వినుతికెక్కారు. తాజాగా ఇండియాలోనే భారీ ప్యాకేజీ ..వేత‌నం తీసుకునే వ్య‌క్తిగా పురి రికార్డు బ్రేక్ చేశారు.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కంపెనీగా ఐటీసీ ఎదిగింది. సంజీవ్ పారితోష‌కం గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రం 2018-2019లో 51 శాతానికి పైగా పెరిగి..6 కోట్ల 16 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇందులో మూల వేత‌నం ఒక కోటి 44 ల‌క్ష‌లు కాగా , 40 ల‌క్ష‌లు భ‌త్యాలు, 4 కోట్ల 32 కోట్ల ప‌నితీరు ఆధారంగా బోన‌స్ ప‌రంగా యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. 2017-18 సంవ‌త్స‌రంలో సంజీవ్ మూల వేత‌నం 4 కోట్ల 6 ల‌క్ష‌లుగా ఉంది. ఐటీసీ కంపెనీలో ప్ర‌స్తుతం 91 మంది కోటికి పైగా వేత‌నం పొందుతున్న వారుండ‌డం ఆ కంపెనీ ప్రోగ్రెస్ కు నిద‌ర్శ‌నం. ఇండియన్ టొబాకో కంపెనీ సార‌థి దేవేశ్వ‌ర్ ఇటీవలే మృతి చెందారు. ఆయ‌న అనంత‌రం సంజీవ్ పురి పూర్తి స్థాయిలో ఛైర్మ‌న్ అండ్ సిఎండిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇక కంపెనీకి చెందిన ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఎన్. ఆనంద్ వేత‌నం 3 కోట్ల 62 ల‌క్ష‌లు ఉండ‌గా, చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్న ఆర్. టండ‌న్ వేత‌నం 3 కోట్ల 20 ల‌క్షలు తీసుకుంటున్నారు. కాన్పూర్ ఐఐటీలో సంజీవ్ పురి చ‌దివారు. యూనివ‌ర్శిటీ ఆఫ్ పెన్సీల్వానియాలో చ‌దువు పూర్తి చేశారు. ఐటీసీ బోర్డ్ డైరెక్ట‌ర్ గా జాయిన్ అయ్యారు. సంజీవ్ పురి 1986లో ప్ర‌వేశించారు. మాన్యుఫాక్ష‌రింగ్, ఆప‌రేష‌న్స్, డిజిట‌ల్ టెక్నాల‌జీని ప‌రుగులు తీసేలా చేశారు. క‌స్ట‌మ‌ర్ ఇంటిమ‌సీ, ఆప‌రేష‌న‌ల్ ఎక్స‌లెన్స్ పై దృష్టి సారించారు 2009లో . టొబాకో డివిజ‌న‌ల్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. 2014లో ట్రేడ్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ ఫంక్ష‌న్‌కు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప‌యోనీర్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ లీడ‌ర్‌షిప్ క్వాలిటీస్ లో సంజీవ్ పురి టాప్‌లో నిలిచారు.

 60 శాతంగా ఉన్న కంపెనీ ఆదాయాన్ని 80 శాతానికి పెంచారు. ఈ ఘ‌న‌త సాధించిన వ్య‌క్తిగా పురి పేరొందారు. 2001లో ఐటీసీ స‌బ్సిడీగా మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా సంజీవ్ ప‌దోన్న‌తి పొందారు. ఐటీసీ ఇన్ఫోటెక్ కంపెనీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు 2008లో. 25 మిలియ‌న్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చి పెట్టారు ఈ సీఎండి. ఫిక్కీ ఎఫ్ఎంసీజీ క‌మిటీకి ఛైర్మ‌న్‌గా, ఫిక్కీ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మెంబ‌ర్‌గా, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టాస్క్ ఫోర్స్ ఈస్ట‌ర్న్ రీజియ‌న్ కు ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు. సిఐఐ ఈస్ట‌ర్న్ రీజిన‌ల్ కౌన్సిల్ స‌భ్యుడిగా కొన‌సాగారు. మొత్తం మీద ఈ ఐఐటీయ‌న్ సాధించిన ఘ‌న‌త ఒక్క‌టే..త‌న ప‌నితీరు ఆధారంగా అత్యున్న‌త ..భారీ వేత‌న జీవిగా ఇండియాలో పేరు తెచ్చుకున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!