ప్ర‌పంచంలో ఎల్ఐసి న‌మ్మ‌క‌మైన బ్రాండ్

భార‌తీయ జీవిత బీమా సంస్థ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. ఇప్ప‌టికే ఇండియాలో సామాన్యుడి నుండి క‌రోడ్‌ప‌తి వ‌ర‌కు బీమా ప‌రంగా విశిష్ట సేవ‌లందిస్తున్న ఈ కంపెనీ ..ఇండియాకు ఓ బ్రాండ్‌గా నిలిచి పోయింది. త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకుంది. సాధార‌ణ బీమా నుండి అన్ని ఫార్మాట్‌ల‌లో పాల‌సీదారులకు, వారి కుటుంబాల‌కు తోడుగా వుంటోంది. క‌ష్టకాలంలో న‌మ్మ‌కాన్ని..భ‌రోసాను క‌ల్పిస్తోంది. ఈ క్రెడిట్ అంతా ఆ సంస్థ‌ను ఇప్ప‌టికీ ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో..న‌డిపిస్తూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో టాప్ వ‌న్‌లో నిలిచింది. ఇదంతా దానిని న‌మ్ముకున్న కోట్లాది ప్ర‌జ‌ల స‌హ‌కారం, ల‌క్ష‌లాది మంది ఏజెంట్లు క‌ష్ట‌ప‌డ‌టం. తాజాగా అంత‌ర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ కంటార్ ఈ ఏడాదికి గాను విడుద‌ల చేసిన టాప్ 100 బ్రాండ్స్ జాబితాలో భార‌త్‌కు చెందిన మూడు కంపెనీలు మాత్ర‌మే చోటు ద‌క్కించుకున్నాయి. 

వాటిలో మొద‌టి స్థానం ఎల్ఐసీ, హెచ్‌డిఎఫ్‌సీతో పాటు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. జీవిత బీమా సంస్థ‌కు 68 స్థానం ల‌భిస్తే..టీసీఎస్ కు 97 స్థానం ల‌భించింది. అంత‌ర్జాతీయ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీ అమెజాన్ అగ్ర స్థానం ద‌క్కించు కోగా..గ‌త ఏడాది మొద‌టి స్థానంలో ఉన్న గూగుల్ ఈసారి మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది. ఐఫోన్ దిగ్గ‌జం ఆపిల్ రెండో స్థానంలో నిల‌వ‌గా, మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో, వీసా ఐదు, ఫేస్ బుక్ ఆరో స్థానంలో, ఆలీబాబా ఏడో స్థానంలో నిలిచాయి. ఇక మెక్ డొనాల్డ్ కంపెనీ తొమ్మిదో స్థానంలో , ఏటీ అండ్ టి 10వ స్థానంలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ‌గా అమెరికాకు చెందిన కంపెనీలే ఉండ‌డం విశేషం. ఇక భార‌తీయ జీవిత బీమా సంస్థ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఈ కంపెనీకి ఎం.ఆర్‌. కుమార్ ఛైర్మ‌న్‌గా ఉన్నారు.

ముంబై కేంద్రంగా ఈ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తూ కోట్లాది ప్ర‌జ‌ల నమ్మ‌కాన్ని చూర‌గొంది. 25, 29, 390 కోట్ల విలువ‌ను సంపాదించింది. లైఫ్ ఫండ్ 1,433, 103.14 కోట్లు ఉండ‌గా పాల‌సీలు అమ్మ‌గా వ‌చ్చిన ఆదాయం 367.82 కోట్లను 2012-2013 లో సంపాదించింది. 1956లో దీనికి ఆమోదం తెలిపారు. ద బాంబే మ్యూచువ‌ల్ లైఫ్ అష్యూరెన్స్ సొసైటీ పేరుతో 1870లో ఏర్ప‌డింది. దీంతో పాటే పోస్ట‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని 1884లో , భార‌త్ ఇన్సూరెన్స్ కంపెనీని 1896లో ప్రారంభించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని 1906లో, నేష‌న‌ల్ ఇన్సూరెన్స్‌, కో ఆప‌రేటివ్ అష్యూరెన్స్‌ను స్టార్ట్ చేశారు. హిందూస్తాన్ కోఆప‌రేటివ్స్ , ఇండియ‌న్ మెర్కంటైల్, జ‌న‌ర‌ల్ అష్యూరెన్స్‌, స్వ‌దేశి లైఫ్‌, సాయాద్రి ఇన్సూరెన్స్ 1986లో ప్రారంభించారు. ఇవ‌న్నీ బీమా కంపెనీలు. ఎల్ఐసీకి 150 ఏళ్ల చ‌రిత్ర ఉంది. 1956లో జాతీయం చేశారు ఈ కంపెనీని. కుమార్ ఛైర్మ‌న్‌గా ఉన్న ఈ కంపెనీకి ఎండీలుగా వేణుగోపాల్, హేమంత్ బార్గ‌వ‌, విపిన్ ఆనంద్, సుశీల్ కుమార్‌లు ఉన్నారు. 

ప్రైవేట్ బీమా కంపెనీలు ఎన్ని వ‌చ్చినా ఎల్ ఐసీ స్పీడ్‌ను అందుకోలేక పోతున్నాయి. ఐదేళ్ల ప్ర‌ణాళిక ప‌రంగా చూస్తే..ఎల్ ఐ సీ ప్ర‌స్థానం ఇలా ఉంది. 1956 నుండి 1961లో 184 కోట్ల ఆదాయం గ‌డించింది. 1961-1966లో 285 కోట్లు, 1969-1974లో 1,530 కోట్లు, 1974-1979లో 2, 942 కోట్ల ఆదాయం పొందింది. 1980-1985లో 7 వేల 140 కోట్లు, 1985-1990లో 12 వేల 969 కోట్లు, 1992 - 1997లో 56 వేల 097 కోట్లు, 1997-2002లో 1,79 కోట్లు , 2002-2007లో 3 ల‌క్ష‌ల 94 వేల 779 కోట్ల ఆదాయం గ‌డించింది ఎల్ ఐ సీ సంస్థ‌. 2007-2012లో 7 ల‌క్ష‌ల 4 వేల 151 కోట్లు , 2012 -2017లో 14 ల‌క్ష‌ల 23 వేల 55 కోట్లు, 2017-2022 వ‌ర‌కు 3 ల‌క్ష‌ల 82 వేల 479 కోట్ల ఆదాయం గ‌డిస్తుంద‌ని అంచ‌నా. రోజు రోజుకు కొత్త కొత్త ప్రాడ‌క్ట్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ దూసుకెళుతోంది. త‌న మార్కెట్‌ను తానే అధిగ‌మిస్తోంది ఈ కంపెనీ. ఎల్ ఐసీ హౌసింగ్ ద్వారా అత్య‌ధిక ఆదాయాన్ని గ‌డిస్తోంది. పాల‌సీలు అమ్మ‌డంలో ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్. అందుక‌నే ప్ర‌పంచంలోనే టాప్ 100లో చోటు ద‌క్కించుకుంది. 

కామెంట్‌లు