పాటల పాలపుంత ..గుండెల్లో గిలిగింత..!

భారతీయ సినీ రంగంలో మేరునగధీరురాలిగా పేరు తెచ్చుకున్నారు ఆషా భోంస్లే. ఓ వైపు అక్క లతా మంగేష్కర్ తనకంటూ ఎదురే లేకుండా ..ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న రోజుల్లో అప్పుడే వికసించిన అమ్మాయి గొంతులా ..పిల్ల తెమ్మరలా..కోకిల స్వరంతో ముందుకు వచ్చింది ఆషా. లత ప్రశాంతంగా పాడుతూ వెళుతుంటే..ఆషా మాత్రం పుల్ జోష్ మీదున్న సాంగ్స్ ఎంచుకుంది. 8 సెప్టెంబర్ 1933లో జన్మించిన ఆషా..1943లో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక అప్పటి నుండి ఇప్పటి దాకా కొన్నేళ్ల పాటు తన గాత్ర మాధుర్యంతో వందలాది పాటలు పాడారు. తన కంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఓ సాథిరే తేరెబి నభీ క్యా జీనా అంటూ పాడుతుంటే జనం మైమరిచి పోయారు. ఆ గొంతులో పిల్లన గ్రో వి ఇమిడి పోయిందా అన్న స్థాయిలో ఆషా పాడకుంటూ వెళ్లారు. దాదాపు 1000 సినిమాల్లో పాడి రికార్డు సృష్టించారు. ప్రతి సారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయినవి ఎన్నో. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. లత అప్పటికే ఇండియన్ సినిమా రంగాన్ని ఏలుతున్నారు. ఆమె తన స్వంత చెల్లెలు కోసం ఏనాడూ సిఫారసు చేయలేదు. నేను నిన్ను సిఫారసు చేస్తే ఏం లాభం..నీకంటూ నీవే కష్ట...