బంధాల అనుబంధమే లింక్డిన్
ఏ ముహూర్తాన ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రారంభమైందో కానీ క్రియేటివిటికి అపారమైన అవకాశాలు ఏర్పడ్డాయి. అనుకోని రీతిలో మానవ శ్రమ కొంత మేరకు తగ్గింది. మానవ వనరుల వినియోగం పెరిగింది. సామాజిక మాధ్యమాలు లోకాన్ని ఊహించని రీతిలో ప్రభావితం చూపే స్థాయికి చేరుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్మరించలేని మాధ్యమంగా మారిపోయింది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్య , పారిశ్రామిక , మీడియా, ఎంటర్‌టైన్ మెంట్ ,ఆటోమొబైల్, టెలికాం, రోడ్లు, గృహ, నిర్మాణ రంగాలను ఐటీ శాసిస్తోంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఫేస్ బుక్, గూగుల్, యూట్యూబ్, వాట్స్ అప్, లింక్డిన్ ,ఇన్‌స్టాగ్రాం, తదితర సామాజిక మాధ్యమాలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఇవి ఆకట్టుకోగా ఒక్క లింక్డ్ ఇన్ మాత్రం రోజు రోజుకు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, కంపెనీలతో పాటు బిజినెస్ పర్సనాలిటీస్, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, ఛైర్మన్లు, రైటర్స్, పోయెట్స్, స్టార్టప్ క్రియేటర్స్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, ఐటీ ఎక్స్‌పర్ట్స్, ఆంట్రప్రెన్యూర్స్, వరల్డ్ మోస్ట్ ఫేవరబుల్ పర్సన్స్, క్రియేటర్స్, తదితరులు ఇందులో ఎప్పటికప్పుడు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అందుకే ఎక్కడా లేని విధంగా ఈ సామాజిక మాధ్యమం అందరిని..అన్ని వర్గాల వారి ఆదరణను చూరగొంటోంది. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసింది. విజేతలను కలుపుతోంది. వారి అనుభవాలను పాఠాలుగా భవిష్యత్ తరాలకు తెలియ చెప్పేలా చేస్తోంది. లింక్డ్ ఇన్ లో సభ్యులుగా ఉండటమంటే మన బ్రాండ్ ను..మన ఇమేజ్‌ను మనం పెంచుకున్నట్టు అన్నమాట. గొప్ప వ్యక్తులు..వారి లైఫ్ స్టయిల్ ఇందులో అగుపించేలా చేస్తోంది. సో మీరు ఇంకా చేరకపోతే ..తక్షణమే లింక్‌డ్ ఇన్ లో సభ్యులై పోండి. కొత్త ప్రపంచంలోకి మారండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి