పాట‌ల పాల‌పుంత ..గుండెల్లో గిలిగింత‌..!

భార‌తీయ సినీ రంగంలో మేరున‌గ‌ధీరురాలిగా పేరు తెచ్చుకున్నారు ఆషా భోంస్లే. ఓ వైపు అక్క ల‌తా మంగేష్క‌ర్ త‌నకంటూ ఎదురే లేకుండా ..ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలుతున్న రోజుల్లో అప్పుడే విక‌సించిన అమ్మాయి గొంతులా ..పిల్ల తెమ్మ‌ర‌లా..కోకిల స్వ‌రంతో ముందుకు వ‌చ్చింది ఆషా. ల‌త ప్ర‌శాంతంగా పాడుతూ వెళుతుంటే..ఆషా మాత్రం పుల్ జోష్ మీదున్న సాంగ్స్ ఎంచుకుంది. 8 సెప్టెంబ‌ర్ 1933లో జ‌న్మించిన ఆషా..1943లో బాలీవుడ్ లోకి ఎంట‌ర్ అయ్యారు. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి దాకా కొన్నేళ్ల పాటు త‌న గాత్ర మాధుర్యంతో వంద‌లాది పాట‌లు పాడారు. త‌న కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకున్నారు. ఓ సాథిరే తేరెబి న‌భీ క్యా జీనా అంటూ పాడుతుంటే జ‌నం మైమ‌రిచి పోయారు. ఆ గొంతులో పిల్ల‌న గ్రో
వి ఇమిడి పోయిందా అన్న స్థాయిలో ఆషా పాడ‌కుంటూ వెళ్లారు. దాదాపు 1000 సినిమాల్లో పాడి రికార్డు సృష్టించారు. ప్ర‌తి సారి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారి పోయినవి ఎన్నో. అయినా ఆమె వెన‌క్కి త‌గ్గ‌లేదు. ల‌త అప్ప‌టికే ఇండియ‌న్ సినిమా రంగాన్ని ఏలుతున్నారు. ఆమె త‌న స్వంత చెల్లెలు కోసం ఏనాడూ సిఫార‌సు చేయ‌లేదు. నేను నిన్ను సిఫార‌సు చేస్తే ఏం లాభం..నీకంటూ నీవే క‌ష్ట‌ప‌డాలి. నీదైన ముద్ర‌ను నీవు ఏర్ప‌ర్చుకోవాలి. అప్పుడే అవ‌కాశాలు మ‌న‌ల్ని త‌లుపు త‌డ‌తాయి. అంత వ‌ర‌కు అహ‌ర్నిష‌లు గాత్రానికి మెరుగులు దిద్దు కోవ‌డ‌మే. మ‌రో మార్గం లేదు. పోనీ నేను చెప్పాను అనుకో..కాద‌న‌కుండా అవ‌త‌లివాళ్లు ఇవ్వొచ్చు. కానీ నీలో వున్న టాలెంట్ కు ఏం గుర్తింపు వుంటుంద‌ని అని అక్క చెల్లెల్ని ప్ర‌శ్నించింది. ఆషా ఎప్పుడూ అక్క‌ను అడ‌గ‌లేదు. ఎవ‌రినీ దేబ‌రించ‌లేదు. ఇంకెవ్వ‌రికీ త‌లొగ్గ లేదు.

కొన్నేళ్ల పాటు..కొన్ని త‌రాల పాటు గుండెల్లో ప‌దిలంగా గూడు క‌ట్టుకునేలా పాట‌ల్ని పాడింది ఆషా. ఎప్పుడూ న‌వ్వు ముఖం. ఆ ముఖం మీద ..అందాన్ని మ‌రింత ద్విగుణీకృతం చేసే సింధూరం. అడుగ‌డుగునా భార‌తీయ‌త‌ను త‌ల‌పింప చేసేలా వ‌స్త్ర‌ధార‌ణ‌. క‌ట్టు, బొట్టు, న‌డ‌త అలాగే త‌న మ‌ధుర‌మైన గాత్రంలాగానే కోట్లాది భార‌తీయుల‌నే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న వాయిస్‌తో మెస్మ‌రైజ్ చేసింది ఆమె. మోస్ట్ పాపుల‌ర్ సింగ‌ర్‌గా ..ఎవ‌ర్ గ్రీన్ ..స‌క్సెస్ ఫుల్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు ఆర్‌.డి. బ‌ర్మ‌న్ ఆమెతో ఎన్నో ప్ర‌యోగాలు చేశాడు. ప‌ది కాలాల పాటు మ‌రిచి పోలేని గీతాల‌ను ఆమెతో పాడించాడు. సినిమా రంగానికి చెందిన పాట‌ల‌తో పాటు పాప్ , గ‌జ‌ల్స్‌, భ‌జ‌న పాట‌లు వేలాదిగా పాడారు. భార‌తీయ సంప్ర‌దాయాన్ని ప్ర‌తిబింబించేలా త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు. జాన‌ప‌దాలు, ఖ‌వ్వాలీ సాంగ్స్ ల‌లో కూడా సిద్ధ‌హ‌స్తురాలిగా పేరొందారు. తండ్రి దీనానాథ్ మంగేష్క‌ర్ న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డంతో త‌న పిల్ల‌ల‌కు సంగీతంలోని మెళ‌కువ‌ల‌ను నేర్పించాడు. త‌న అద్భుత‌మైన గాత్రంతో వేలాది పాట‌ల‌కు ప్రాణం పోశారు ఆషాభోంస్లే. ఇండియాతో పాటు ఎన్నో దేశాలలో నిర్వ‌హించిన సంగీత క‌చేరీల‌లో పాల్గొన్నారు. ప‌లు ప్రోగ్రామ్స్‌కు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప‌లు భాష‌ల్లో పాడి మెప్పించారు. ఏకంగా ఏడు సార్లు ఉత్త‌మ గాయ‌నిగా ఎంపిక‌య్యారు. 18 సార్లు నామినేష‌న్‌కు ప‌రిశీలించ‌బ‌డ్డారు. ఆల్ టైం సింగ‌ర్‌గా రికార్డు సృష్టించారు.

1966లో వ‌చ్చిన దాస్ లాఖ్ సినిమాకు గాను 1968లో గ‌రీబో కి సునో అనే పాట పాపుల‌ర్ సాంగ్ గా నిలిచింది. అదే ఏడాది షికార్ సినిమాకు గాను ప‌ర్దే మే రెహ్నే దో సాంగ్ రికార్డులు తిర‌గ రాసింది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ వ‌న్ లో నిలిచి 1969లో ఫిలిం ఫేర్ అవార్డు పొందింది. 1971లో వ‌చ్చిన కార‌వాన్ సినిమాలో ఆమె పాడిన పియా తూ అబ్ తో ఆజా..అనే పాట ఉర్రూత లూగించింది. అభిమానుల్లో అంతులేని జోష్ నింపింది. 1972లో హ‌రే రామ హ‌రే కృష్ణ సినిమా క‌ల‌క్ష‌న్స్‌ల‌లో రికార్డులు తిర‌గ రాసింది. ఆ సినిమాకు పాట‌లు హైలెట్‌గా నిలిచాయి. అందులో పాడిన దం మారో దం సాంగ్ ఆషా భోంస్లేను అంత‌ర్జాతీయ స్థాయిలో సింగ‌ర్‌గా పేరు తెచ్చుకునేలా చేసింది. ఆ పాట ఇండియాలోని ప్ర‌తి చోట వినిపించింది. 1973లో ఈ సాంగ్‌కు ప్ర‌త్యేకంగా ఫిలిం ఫేర్ జ్యూరీ ఏకంగా ఒన్ అండ్ ఓన్లీ విమెన్ సింగ‌ర్‌గా ఆషాను ప్ర‌క‌టించింది. అదే ఏడాదిలో విడుద‌లైన నైనా సినిమాకు గాను హోనే ల‌గీ హై రాత్ అనే సాంగ్ రొమాంటిక్ సాంగ్‌గా పేరు తెచ్చుకుంది. ఇదే పాట‌కు 1974లో ఫిలిం ఫేర్ అవార్డు ద‌క్కించుకుంది. అదే ఏడాది ప్రాన్ జాయే ప‌ర్ వ‌చ‌న్ న జాయే సినిమాకు గాను చైన్ సే హంకో క‌భీ అనే గీతాన్ని ఆషా ఆలాపించారు. 1975లో మ‌రింత పాపుల‌ర్ సాంగ్ గా పేరు తెచ్చు కోవ‌డంతో ఫిలిం ఫేర్ లో మ‌రో సారి ఉత్త‌మ గాయ‌ని పుర‌స్కారం పొందారు. 1978లో డాన్ సినిమా వ‌చ్చింది. ఇది మోస్ట్ స‌క్సెస్ ఫుల్ సినిమా. ఇందులో ఆషా యే మేరా దిల్..అంటూ త‌న ప్ర‌తాపాన్ని చూపించారు.

1979లో మ‌రో అవార్డును చేజిక్కించుకున్నారు ఆషా. ఇదంతా ఒక ఎత్తైతే ..సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ..ఊర్మిళ‌..అమీర్ ఖాన్‌తో క‌లిసి తీసిన రంగీలా సినిమా ఇండియ‌న్ సినిమాను షేక్ చేసింది. కోట్లాది రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది. ఎక్క‌డ చూసినా ఆ సినిమానే. ఒకే ఒక్క సినిమాతో ఊర్మిలా మండోట్క‌ర్ పాపుల‌ర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇదే సినిమాకు మ్యూజిక్ లెజెండ్ అల్లా ర‌ఖా రెహ‌మాన్ అందించిన సంగీతం యూత్‌ను ..అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఊపు వ‌చ్చేలా చేసింది. ఇదే సినిమా కోసం రెహ‌మాన్ ..క‌ష్ట‌ప‌డి స్వ‌రాలు స‌మ‌కూర్చి పెట్టాడు. యాయిరే యాయిరే జోర్ ల‌గాకే నాచ్‌రే అంటూ పిల్ల గొంతుక‌తో వ‌చ్చిన ఆ సాంగ్ ఆల్ టైం సాంగ్‌గా ఇండియాలో అన్ని మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ వ‌న్‌గా నిలిచింది. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలో ఇదో అరుదైన రికార్డు. ఆషా హై పీచ్‌లో పాడిన ఈ సాంగ్ ప్ర‌తి చోటా..ప్ర‌తి నోటా ప‌లికేలా చేసింది. 1996లో స్పెష‌ల్ అవార్డుకు ఎంపిక‌య్యారు ఆషా.

2001లో పాట‌ల పూదోట‌గా మారిన ఈ అరుదైన గాయ‌నికి ఏకంగా 2001లో ఫిలిం ఫేర్ ..లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది. రెండుసార్లు జాతీయ స్థాయిలో ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని పుర‌స్కారాన్ని పొందారు. 1981లో వ‌చ్చిన ఉమ్రావ్ జాన్ సినిమాలో ఆషా దిల్ చీజ్ క్యా హై అంటూ గుండెల్ని మీటారు. 1986లో ఇజాజ‌త్ సినిమాలో మేరా కుచ్ సామాన్ అంటూ హాయిగా మ‌న‌ల్ని వినేలా చేశారు. బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగ‌ర్‌గా ప్ర‌శంస‌లు అందుకున్నాఉ. ఇఫా అవార్డుకు ఎంపిక‌య్యారు. 2002లో అమీర్ ఖాన్ న‌టించిన ల‌గాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇండియాలో అత్య‌ధిక వ‌సూల్ళ‌ను క‌లెక్ట్ చేసింది. ఇదే సినిమాకు రెహ‌మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఉదిత్ నారాయ‌ణ్‌తో క‌లిసి ఆషా భోంస్లే ఆలాపించిన రాధా కైసే న జ‌లే సాంగ్ ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్‌గా నిలిచింది. సినీ రంగంలోనే కాకుండా ఇత‌ర రంగాల‌లో కూడా పాట‌ల‌కు ప్రాణం పోసిన ఈ సంగీత సామ్రాజ్ఞికి కోట్లాది మంది అభిమానులున్నారు. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ వాసుల‌కు ఆమె గొంతుక అంటే పిచ్చి అభిమానం.

1987లో భార‌త్ - పాకిస్తాన్ అసోసియేష‌న్ యుకెలో నైటింగేల్ ఆఫ్ ఏషియా అవార్డుతో స‌త్క‌రించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 1989లో ల‌తా మంగేష్క‌ర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును ఆషాకు ఇచ్చింది. ప్రైవేట్ ఆల్బంలో ఆల్ టైం రికార్డుగా నిలిచింది ఆమె పాడిన పాట జానం స‌మ‌జా క‌రో ..ఇందు కోసం 1997లో వీడియోకాన్ అవార్డుతో స‌త్క‌రించింది. ఇదే పాపుల‌ర్ సాంగ్‌కు గాను ప్ర‌పంచంలోనే పేరొందిన మ్యూజిక్ ఛాన‌ల్స్ ఎంటివి, వి టీవిలు ఏకంగా 1997లో బెస్ట్ ..మోస్ట్ పాపుల‌ర్ పాప్ సాంగ్‌గా పేర్కొంటూ ఆషాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్‌గా ప్ర‌క‌టించాయి. 1998లో ద‌యావ‌తి మోడి అవార్డును, 1999లో మ‌రో అవార్డును ద‌క్కించుకున్నారు. దుబాయి ప్ర‌భుత్వం 2000లో సింగ‌ర్ ఆఫ్ ద మిలేనియం పేరుతో ఆషాను ఘ‌నంగా స‌న్మానించారు. అదే ఏడాది జీ టివి గోల్డ్ బాలీవుడ్ అవార్డును ప్ర‌క‌టించింది. 2001లో కంబ‌ఖ్త్ ఇష్క్ సాంగ్‌కు గాను ఎంటీవీ అవార్డుతో స‌త్క‌రించింది. అప్ప‌టి యుకె ప్ర‌ధాన‌మంత్రి టోని బ్లేయ‌ర్ 2002లో బిబిసి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో ఆషాను స‌న్మానించారు. అదే ఏడాది లగాన్ సినిమాకు గాను జీ సినీ అవార్డును ప్ర‌క‌టించింది. హాల్ ఆఫ్ ఫేమ్‌తో ఆషాను ఎంపిక చేసింది. సాన్‌సూయి మూవీ అవార్డును ప్ర‌క‌టించింది. 2003లో ఇండియ‌న్ మ్యూజిక్‌లో అత్యుత్త‌మ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చినందుకు గాను స్వ‌ర్ణాల‌య యేసుదాస్ అవార్డును బ‌హూక‌రించింది.

2004లో ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఏకంగా లివింగ్ లెజెండ్ అవార్డును ప్ర‌క‌టించింది. పాప్ సాంగ్ ఆజ్ జానే కి జిద్ నా క‌రో సాంగ్‌కు గాను 2005లో ఎంటీవీ ఇమ్మెన్స్ ఉత్త‌మ మ‌హిళా గాయ‌కురాలిగా ఎంపిక చేసింది. అదే ఏడాది ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ స్ట‌యిలిష్ సింగ‌ర్‌గా ఎంపికైంది ఆషా భోంస్లే. ఉస్తాద్ అలీ అక్భ‌ర్ ఖాన్ తో క‌లిసి పాడిన మ్యూజిక్ ఆల్బంకు గాను 1997లో గ్రామీ అవార్డుకు నామినేట్ కాబ‌డ్డారు. ఇండియా నుండి మొద‌టి సింగ‌ర్ ఆమె. 17 సార్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుండి అవార్డులు తీసుకున్నారు. 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. అమ‌రావ‌తి విశ్వ‌విద్యాల‌యంతో పాటు జ‌ల‌గావ్ యూనివ‌ర్శిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌ల‌ను ప్ర‌దానం చేసింది. సంగీత రంగంలో అపార‌మైన కృషి చేసినందుకు గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ‌మైన‌దిగా భావించే ద ఫ్రెడ్డీ మెర్క్యూరీ అవార్డుకు ఎంపిక‌య్యారు. 2002లో బ‌ర్మింగ్ హోంలో జ‌రిగిన ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్పెష‌ల్ కేట‌గిరీ కింద ఉత్త‌మ గాయ‌నిగా ఎంపిక‌య్యారు.

భార‌త ప్ర‌భుత్వం ఈ సంగీత సామ్రాజ్ఞికి ప‌ద్మ విభూష‌న్ అంద‌జేసింది. గ‌త 50 ఏళ్ల సినీ..సంగీత రంగ ప్ర‌స్థానంలో ఆమె ఎక్క‌ని ఎత్తులు లేవు..20 మ్యూజిక్ ఐకాన్స్ గా ఆమె పాడిన పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. 2011లో ఆసియా ఖండంలోనే అత్యంత పాపుల‌ర్ సింగ‌ర్‌గా పేర్కొంటూ..గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఆషా పేరును చేర్చింది. 20 భార‌తీయ భాష‌ల్లో 11000 పాట‌లు పాడిన గాయ‌నిగా చ‌రిత్ర‌లో నిలిచి పోయేలా చేసింది. జోధ్‌పూర్ నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఇటీవ‌ల డాక్ట‌ర్ ఆఫ్ లిట‌రేచ‌ర్ ప్ర‌క‌టించి..త‌న గౌర‌వాన్ని చాటుకుంది. ఓ వైపు ల‌తా మంగేష్క‌ర్ ఇంకో వైపు ఆషా భోంస్లేలు ..80 ఏళ్ల వ‌య‌సు దాటినా..నేటికీ త‌మ అద్భుత‌మైన గాత్ర మాధుర్యాన్ని పంచుతున్నారు. పాట‌ల తోటలో విహ‌రించేలా చేస్తున్నారు. మ‌హోన్న‌త‌మైన వీరిద్ద‌రి కాలంలో ఉన్నందుకు మ‌నం అదృష్టువంతుల‌మే అనుకోవాలి. 

కామెంట్‌లు