పోస్ట్‌లు

డిసెంబర్ 23, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

రాహుల్ కు పీకే ప్రశంస

చిత్రం
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ సిటిజన్ షిప్ చట్ట సవరణపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఎటు చూసినా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటి దాకా ఆరు మందికి పైగా మృతి చెందారు. బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లో ధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ ఉప నేత ప్రశాంత్ కిషోర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అంతే కాదు విపక్షాలు ఏకంగా కావాలని, పొరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. అయితే సిటిజన్ షిప్ చాట సవరణ వద్దంటూ ఉద్యమ బాట పట్టిన రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం  , జాతీయ పౌరుల జాబితాలకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై హర్షం వ్యక్తం చ...

లారాను పొగిడిన కోవింద్

చిత్రం
ఇద్దరు వేర్వేరు రంగాలకు చెందిన అద్భుతమైన వ్యక్తులు. వారిద్దరూ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాలలో కొనసాగుతున్న వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ దిగ్గజాలే. వారెవరో కాదు ఒకరు ప్రపంచ క్రికెట్ లో ఎందరికో స్ఫూర్తి దాయకంగా ఉంటూ వచ్చిన విండీస్ కు చెందిన బ్రయాన్ లారా అయితే మరొకరు భారత దేశ ప్రెసిడెంట్ రాంనాథ్ కోవింద్. వీరిద్దరూ దేశ రాజధానిలో కలుసుకున్నారు. ఇదో అరుదైన సన్నివేశం. దేశ చరిత్రలో మరిచి పోలేని రోజు కూడా. ఎందుకంటే లారా, కోవింద్ లు కస్టపడి పైకి వచ్చిన వారే. తమ స్వశక్తితో అత్యున్నతమైన పదవులను అధిరోహించిన వారే. ఎన్నో కష్టాలు దాటుకుని జీవితంలో విజయాలు సాధించారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు. ఆయన దళిత జాతికి చెందిన వ్యక్తి అని. ఇప్పుడు భారత దేశానికి మొదటి పౌరుడు. మరొకరు లారా. ఈ క్రికెట్ దిగ్గజం అద్భుతమని చెప్పక తప్పదు. క్రికెట్ లెజెండ్స్ లలో లారాను ఒకడిగా పేర్కొంటారు. ఆయన ఆటలోనే కాదు వ్యక్తిగతంగా కూడా ఎంతో సౌమ్యుడు. ప్రస్తుతం క్రికెట్ రంగం నుంచి రిటైర్ అయినా స్టార్ టీవీ లో కామెంటేటర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ సందర్బంగా లారా ఇండియాకు వచ్చాడు. భారత కెప్టెన్‌ విరాట్...

జార్ఖండ్ డైనమెట్..క్రికెట్ లెజెండ్

చిత్రం
మిస్టర్ కూల్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లోకి ఎంటరై 15 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ అద్భుతమైన ఆటగాడు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడడు. కేవలం ఆట మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఇతడి నైజం. ఇంటర్ నేషనల్ క్రికెట్ లో ఎమ్మెస్ ధోని అంటే ఓ క్రేజ్. ఇండియాలో అతడంటే కోట్లాది అభిమానులు చెవి కోసుకుంటారు. అంతలా పాపులర్ అయ్యాడు ఈ ఝార్ఖండ్ డైనమెట్. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. 2004, డిసెంబర్‌ 23 న బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ ధోనికి ఒక చేదు జ్ఞాపకాల్ని మిగల్చగా ఆ తర్వాత కాలంలో అతని కెరీర్‌ ఒక గొప్ప దశను చూసింది.  భారత క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌గా ధోని ఘనత సాధించాడు. అతని సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్స్‌ ట్రోఫీని సాధించి పెట్టిన ఘనత కూడా ధోనిదే.  ఐసీసీ నిర్వహించే అన్ని మేజర్‌ టోర్నీలను సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోని ఖ్యాతి గడించాడు. ఇక భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌ మార్క్‌ ధోని సొంతం. సౌరవ్‌ గంగూలీ ...

హస్తం పుర పోరుకు సిద్ధం

చిత్రం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తన సుముఖతను వ్యక్తం చేసింది. ఏ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. దీంతో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం , టీడీపీ, బిఎస్ పి, తదితర పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి. అన్ని పార్టీలు తాడో పేడో తేల్చు కోవాలని పావులు కదుపుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం పురపాలిక ఎన్నికల్లో తమదే ఆధిపత్యమని, మమ్మల్ని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదంటోంది టిఆర్ ఎస్. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఎన్నడూ లేని రీతిలో పవర్ కోల్పోయిన ఈ పార్టీ నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్ ను ఢీకొనే దమ్ము కలిగిన నాయకుడు ఏ పార్టీలో లేకుండా పోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి అన్ని పార్టీలు. ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా సరే తమ సత్తా ఏమిటో చూపించాలని, కనీసం సగం మున్సిపాల్టీల్లో తమ ప్రతాపాన్ని చూపించాలని డిసై...

ఇక ఎన్నికల నగారా

చిత్రం
ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు తెరలేచింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పట్టును మరింత పెంచు కోవాలనే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది. మరో వైపు విపక్షాలు సైతం తమ సత్తా ఏమిటో సర్కార్ కు తెలియ చెప్పాలని రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల పేరుతో నాన్చుతూ వస్తున్న ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరో ఎన్నికల ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఏ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మున్సి పల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ కమిషనర్‌ నాగిరెడ్డి విడుదల చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 385 డివిజన్లకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టులో పాత కేసు పెండింగ్‌లో ఉండటంతో జహీరాబాద్‌ మున్సి పాలిటీకి ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫి...

జార్ఖండ్ లో సంకీర్ణం..కాంగ్రెస్ కు బలం

చిత్రం
ఒంటెత్తు పోకడలతో, దేశంలోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి జార్ఖండ్ రాష్ట్రంలో వెల్లడైన ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు లాంటిదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం సాక్షిగా ఆయా రాష్ట్రాలలో ఏర్పాటైన విపక్షాలు కొలువుతీరిన ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడంలో ప్రధానమంత్రి మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా లు సిద్ద హస్తులని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ను అప్రజాస్వామిక పద్దతిలో పవర్ కోల్పోయేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయినా, జనం దృష్టిలో మాత్రం విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇదే సమయంలో దేశ ఆర్థిక రంగాన్ని శాసించే మహారాష్ట్ర లో ధర్మబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు అధికారం లోకి రాకుండా అడ్డుకున్నారని, చివరకు ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని బేషరతుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ కొన్నేళ్లుగా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన శివసేన సైతం కమలానికి, మోదీ, అమిత్ చంద్ర షా లకు కోలుకో...

హేమంత్ హవా..జనం ఫిదా

చిత్రం
ఎవరీ హేమంత్ అనుకుంటున్నారా. అతను ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. జాతి యావత్తు అతడి వైపు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. అటు మీడియాలో, సామాజిక మాధ్యమాలలో టాప్ రేంజ్ లో వార్తల్లో ఉంటూ వచ్చిన అతను ఎవరో కాదు జార్ఖండ్ ముక్తీ మోర్చా పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శిబూ సొరేన్ కుమారుడు, జనం మెచ్చిన ప్రజా నాయకుడు హేమంత్ సొరేన్. ప్రస్తుతం బీజేపీకి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు ఈ లీడర్. కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. విస్తృతంగా రాష్ట్రం అంతటా పర్యటించారు. ప్రజల మధ్యనే ఉంటూ కలిసి పోయారు. అత్యంత సాధారణమైన జీవితం గడుపుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. 10 ఆగష్టు 1975 లో పుట్టారు హేమంత్ సొరేన్. జార్ఖండ్ రాష్ట్రానికి ఈ యువ నాయకుడు అయిదవ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తండ్రి పేరు మోసిన రాజకీయ పోరాట యోధుడు. అతడే జగమెరిగిన శిబూ సొరేన్. ఆయన ఇదే రాష్ట్రానికి సీఎం గా కూడా పని చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవేవి నిలవలేదు. దేశంలో హవా చెలాయిస్తున్న బీజేపీకి, మోదీ, అమిత్ షాల హవాకు అడ్డుకట్ట వేశారు హేమంత్ సొరేన్. హేమంత్ కు ఒక చెల్లెలు, ఇద్దరు బ్...

జార్ఖండ్ లో బీజేపీకి షాక్

చిత్రం
దేశాన్ని తమ కనుసన్నలతో శాసిస్తున్న మోదీ, అమిత్ చంద్ర షా పాచికలు పారడం లేదు. నిన్నటి దాకా కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ను కూలదోసిన బీజేపీకి ఇటీవలి కాలం లలిసి రావడం లేదు. అన్నిటా చక్రం తిప్పుతున్న ట్రబుల్ షూటర్ అమిత్ షాకు మహారాష్ట్రలో కోలుకోలేని రీతిలో దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది శివసేన పార్టీ. ఇదే క్రమంలో జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విస్తు పోయేలా ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్‌, జేఎంఎం కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొత్తం మీద అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయి. సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా చివరకు చాలా చోట్ల జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఒక వేళ మెజార్టీకి ఒకటీ, రెండు సీట్ల దూరంలో నిలిచినా..ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాల...

విండీస్ కు అతడే దిక్సూచి

చిత్రం
ఒకప్పుడు క్రికెట్ ఆటలో రారాజుగా వెలుగొందిన విండీస్ క్రికెట్ జట్టు రాను రాను తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. రిచర్డ్స్, రిచర్డ్ సన్, వాల్ష్, బ్రయాన్ లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లున్న ఈ జట్టు కనీస విజయాలకు కూడా ఇబ్బంది పడింది. ఈ పరిస్థితుల్లో విండీస్ జట్టులోని ఆటగాళ్ళను రాటు దేలేలా చేసే బాధ్యతను మాజీ విండీస్ ఆటగాడు సిమ్మన్స్ కు అప్పగించింది. దీంతో జట్టులో ఉన్న బలాలు, బలహీనతల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న ఈ క్రికెట్ కోచ్ గాడిలో పెట్టే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఒక డైరెక్షన్‌లో ముందుకు వెళ్లేలా చేశాడు. ప్రస్తుతం ఆయా జట్ల ఆటగాళ్లకు కఠిన పరీక్షలు పెడుతూ మరింత అద్భుతంగా ఆడేలా ట్రై చేస్తున్నాడు సిమ్మన్స్. టాప్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్న టీమిండియా ఆటగాళ్లను ఎదుర్కొనేలా విండీస్ క్రికెటర్లను తీర్చి దిద్దుతున్నాడు. అన్ని ఫార్మాట్ లలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న టీమిండియా జట్టును రెండో వన్డేలో ఓడి పోయేలా చేశాడు కోచ్. ఏ జట్టుకైనా కోచ్ కీలకం. జట్టుని తీర్చి దిద్దడం. వారి బలాలు, బలహీనతలను గుర్తించడం ఆ దిశగా కృషి చేసే పని కోచ్ దే. టాస్ వేయడం దగ్గరి నుంచి ఏ సమయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో జట్...