రాహుల్ కు పీకే ప్రశంస
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిషోర్ సిటిజన్ షిప్ చట్ట సవరణపై పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఎటు చూసినా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటి దాకా ఆరు మందికి పైగా మృతి చెందారు. బీజేపీ కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ లో ధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న జేడీయూ ఉప నేత ప్రశాంత్ కిషోర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు.
అంతే కాదు విపక్షాలు ఏకంగా కావాలని, పొరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. అయితే సిటిజన్ షిప్ చాట సవరణ వద్దంటూ ఉద్యమ బాట పట్టిన రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం , జాతీయ పౌరుల జాబితాలకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో సీఏఏ, ఎన్నార్సీలను అమలు చేయబోమంటూ అధికారికంగా ప్రకటించాలని రాహుల్‌ను కోరారు.
రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏం చెప్పారన్న దాన్ని నాకు గుర్తు చేసే బదులు... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయ బోమంటూ ఆ పార్టీ చీఫ్ అధికారిక ప్రకటన విడుదల చేయాలన్నారు. ఎన్నార్సీ అమలును రాష్ట్రాలు తిరస్కరిస్తే, దీన్ని అమలు చేసి తీరతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన నిజమయ్యే అవకాశమే ఉండదని పీకే పేర్కొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి