హేమంత్ హవా..జనం ఫిదా
ఎవరీ హేమంత్ అనుకుంటున్నారా. అతను ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. జాతి యావత్తు అతడి వైపు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. అటు మీడియాలో, సామాజిక మాధ్యమాలలో టాప్ రేంజ్ లో వార్తల్లో ఉంటూ వచ్చిన అతను ఎవరో కాదు జార్ఖండ్ ముక్తీ మోర్చా పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శిబూ సొరేన్ కుమారుడు, జనం మెచ్చిన ప్రజా నాయకుడు హేమంత్ సొరేన్. ప్రస్తుతం బీజేపీకి కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చారు ఈ లీడర్. కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలతో కలిసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. విస్తృతంగా రాష్ట్రం అంతటా పర్యటించారు. ప్రజల మధ్యనే ఉంటూ కలిసి పోయారు. అత్యంత సాధారణమైన జీవితం గడుపుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.
10 ఆగష్టు 1975 లో పుట్టారు హేమంత్ సొరేన్. జార్ఖండ్ రాష్ట్రానికి ఈ యువ నాయకుడు అయిదవ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన తండ్రి పేరు మోసిన రాజకీయ పోరాట యోధుడు. అతడే జగమెరిగిన శిబూ సొరేన్. ఆయన ఇదే రాష్ట్రానికి సీఎం గా కూడా పని చేశారు. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవేవి నిలవలేదు. దేశంలో హవా చెలాయిస్తున్న బీజేపీకి, మోదీ, అమిత్ షాల హవాకు అడ్డుకట్ట వేశారు హేమంత్ సొరేన్. హేమంత్ కు ఒక చెల్లెలు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేయలేక పోయారు. ఇదే విషయంన్ని ఎన్నికల అఫిడవిట్ లో పెర్కిన్నారు.
అంతే కాకుండా హేమంత్ సొరేన్ 24 జూన్ 2009 నుండి 4 జనవరి 2010 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. హేమంత్ రెండో సరి సీఎం పీఠం మీద కూర్చోబోతున్నారు. కాంగ్రెస్, ఆర్ ఎల్ డి మద్దతుతో 2013 లో ముఖ్యమంత్రి గా పని చేశారు. ఇదే సమయంలో ప్రెసిడెంట్స్ రూల్ విధించారు. దీంతో సొరేన్ తన పదవిని కోల్పోయారు. పట్టుదలతో జార్ఖండ్ లో తిరిగి జేఎంఎం ను పవర్ లోకి తీసుకు రావడంలో సొరేన్ సక్సెస్ అయ్యారు. ప్రజల్ని ప్రేమించే ఏ నాయకుడికి ఓటమి ఉండదని నిరోపించాడు హేమంత్. మొత్తం మీద అనుకున్నది సాధించే దాకా నిద్రపోని ఈ లీడర్ పైనే జార్ఖండ్ జనం గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి