లారాను పొగిడిన కోవింద్

ఇద్దరు వేర్వేరు రంగాలకు చెందిన అద్భుతమైన వ్యక్తులు. వారిద్దరూ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాలలో కొనసాగుతున్న వారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ దిగ్గజాలే. వారెవరో కాదు ఒకరు ప్రపంచ క్రికెట్ లో ఎందరికో స్ఫూర్తి దాయకంగా ఉంటూ వచ్చిన విండీస్ కు చెందిన బ్రయాన్ లారా అయితే మరొకరు భారత దేశ ప్రెసిడెంట్ రాంనాథ్ కోవింద్. వీరిద్దరూ దేశ రాజధానిలో కలుసుకున్నారు. ఇదో అరుదైన సన్నివేశం. దేశ చరిత్రలో మరిచి పోలేని రోజు కూడా. ఎందుకంటే లారా, కోవింద్ లు కస్టపడి పైకి వచ్చిన వారే. తమ స్వశక్తితో అత్యున్నతమైన పదవులను అధిరోహించిన వారే. ఎన్నో కష్టాలు దాటుకుని జీవితంలో విజయాలు సాధించారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు. ఆయన దళిత జాతికి చెందిన వ్యక్తి అని.

ఇప్పుడు భారత దేశానికి మొదటి పౌరుడు. మరొకరు లారా. ఈ క్రికెట్ దిగ్గజం అద్భుతమని చెప్పక తప్పదు. క్రికెట్ లెజెండ్స్ లలో లారాను ఒకడిగా పేర్కొంటారు. ఆయన ఆటలోనే కాదు వ్యక్తిగతంగా కూడా ఎంతో సౌమ్యుడు. ప్రస్తుతం క్రికెట్ రంగం నుంచి రిటైర్ అయినా స్టార్ టీవీ లో కామెంటేటర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ సందర్బంగా లారా ఇండియాకు వచ్చాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. అతని శారీరక సామర్థ్యం, మానసిక సై్థర్యం, బ్యాటింగ్‌ నైపుణ్యం అసాధారణమని లారా ప్రశంసించాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎవరికీ సాధ్యం కానీ 50 పరుగుల సగటు అతనిదని కితాబిచ్చాడు. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌కు కోహ్లి ఏ మాత్రం తీసిపోడు.

ఆటలో, సన్నాహకంలో అతని నిబద్ధతను మెచ్చు కోవాల్సిందే. బ్యాటింగ్‌లో అతను కష్టపడే తత్వం గొప్పగా ఉంటుంది. ఏ తరం క్రికెట్‌ జట్టుకైనా సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్‌ అతను అని విరాట్‌ను ఆకాశానికెత్తాడు. అంతకు ముందు ఢిల్లీలో ఈ విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా లారా క్రికెట్‌కు చేసిన సేవలను కోవింద్‌ కొనియాడారు. వర్ధమాన క్రీడాకారులకు లారా ఓ రోల్‌ మోడల్‌ అని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్బంగా లారా గుర్తుగా ప్రెసిడెంట్ కోవింద్ కు క్రికెట్ బ్యాట్ ను బహూకరించాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!