హస్తం పుర పోరుకు సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తన సుముఖతను వ్యక్తం చేసింది. ఏ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. దీంతో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం , టీడీపీ, బిఎస్ పి, తదితర పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి. అన్ని పార్టీలు తాడో పేడో తేల్చు కోవాలని పావులు కదుపుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం పురపాలిక ఎన్నికల్లో తమదే ఆధిపత్యమని, మమ్మల్ని అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదంటోంది టిఆర్ ఎస్. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది.
ఎన్నడూ లేని రీతిలో పవర్ కోల్పోయిన ఈ పార్టీ నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్ ను ఢీకొనే దమ్ము కలిగిన నాయకుడు ఏ పార్టీలో లేకుండా పోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి అన్ని పార్టీలు. ఇదిలా ఉండగా ఈసారి ఎలాగైనా సరే తమ సత్తా ఏమిటో చూపించాలని, కనీసం సగం మున్సిపాల్టీల్లో తమ ప్రతాపాన్ని చూపించాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ. ఇప్పటి నుంచే ప్లాన్ రూపొందిస్తోంది. ఆయా మున్సిపాల్టీల వారీగా మేనిఫెస్టోలు, రాష్ట్ర స్థాయిలో మరో మేనిఫెస్టో ను తయారు చేయాలని నిర్ణయించింది. ఈసారి యువతకు సీట్ల కేటాయింపులో పెద్ద పీట వేయాలని అనుకుంటోంది.
అధికార పార్టీని టార్గెట్ చేయడం. వారిలో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం. వారికి ప్రత్యేక ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటోంది. సామాజిక వర్గాల వారీగా తగిన ప్రాధాన్యం, స్థానిక సమస్యలపై స్పష్టమైన విధానం, పార్టీ నేతల మధ్య ఐక్యత అంశాలే ప్రాతిపదికగా కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో టీపీసీసీ రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి పుర పోరులో ఒంటరిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యింది.అవసరాన్ని బట్టి స్థానికంగా టీజేఎస్, కొన్ని చోట్ల వామపక్షాలను కలుపుకుని పోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మలుచు కోవాలని, అదే విధంగా అంతర్గతంగా టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం సమష్టి కృషి చేయాలని, కీలక నేతలంతా మున్సిపాలిటీల్లో ఉండి పని చేయాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో విజయం చేకూర్చే బాధ్యతలను డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారికే అప్పగిస్తోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి