విండీస్ కు అతడే దిక్సూచి


ఒకప్పుడు క్రికెట్ ఆటలో రారాజుగా వెలుగొందిన విండీస్ క్రికెట్ జట్టు రాను రాను తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. రిచర్డ్స్, రిచర్డ్ సన్, వాల్ష్, బ్రయాన్ లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లున్న ఈ జట్టు కనీస విజయాలకు కూడా ఇబ్బంది పడింది. ఈ పరిస్థితుల్లో విండీస్ జట్టులోని ఆటగాళ్ళను రాటు దేలేలా చేసే బాధ్యతను మాజీ విండీస్ ఆటగాడు సిమ్మన్స్ కు అప్పగించింది. దీంతో జట్టులో ఉన్న బలాలు, బలహీనతల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న ఈ క్రికెట్ కోచ్ గాడిలో పెట్టే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఒక డైరెక్షన్‌లో ముందుకు వెళ్లేలా చేశాడు. ప్రస్తుతం ఆయా జట్ల ఆటగాళ్లకు కఠిన పరీక్షలు పెడుతూ మరింత అద్భుతంగా ఆడేలా ట్రై చేస్తున్నాడు సిమ్మన్స్. టాప్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్న టీమిండియా ఆటగాళ్లను ఎదుర్కొనేలా విండీస్ క్రికెటర్లను తీర్చి దిద్దుతున్నాడు.

అన్ని ఫార్మాట్ లలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న టీమిండియా జట్టును రెండో వన్డేలో ఓడి పోయేలా చేశాడు కోచ్. ఏ జట్టుకైనా కోచ్ కీలకం. జట్టుని తీర్చి దిద్దడం. వారి బలాలు, బలహీనతలను గుర్తించడం ఆ దిశగా కృషి చేసే పని కోచ్ దే. టాస్ వేయడం దగ్గరి నుంచి ఏ సమయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో జట్టు కెప్టెన్ కు మెంటర్ గా కూడా వ్యవహరిస్తాడు. తాజాగా కోచ్ సిమ్మన్స్ ప్రస్తుతం అదే చేస్తున్నాడు. ఇండియాలో జరిగిన టీ-20 , వన్డే మ్యాచ్ ల్లో విండీస్ ప్రతి మ్యాచ్ ను గెలవాలన్న కసితో ఆడింది విండీస్. ఆఖరు వన్డేలో ఏకంగా భారీ టార్గెట్ ముందు ఉంచింది. ప్రతి ఒక్క ఆటగాడు వంద శాతం ఆడేలా కృషి చేశాడు సిమ్మన్స్. ఆటలో ఇది ప్రత్యక్షంగా అభిమానులు చూశారు కూడా. 300 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తేనే టీమిండియాపై వత్తిడి పెంచగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు విండీస్ కోచ్.

అదే నిజమైంది కూడా. గతంలో విండీస్‌ టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన  సిమ్మన్స్‌.. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా కోచింగ్‌ బాధ్యతలకు దూరమయ్యాడు. కాగా, ఇటీవల మళ్లీ అతడినే కోచ్‌గా నియమిస్తూ విండీస్‌ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. విండీస్‌ బోర్డులో పాత వారు వెళ్లిపోయి, కొత్త వారు రావడంతో సిమ్మన్స్‌ నియామకం మళ్లీ జరిగింది. ఒక కోచ్‌గా జట్టు పరిస్థితినే కాకుండా ప్రత్యర్థి జట్టును కూడా అంచనా వేయడమే ప్రధానంగా కోచ్‌లు చేసే పని. ప్రస్తుతం విండీస్ అన్ని ఫార్మాట్ లలో పద్దతిగా ఆడుతోంది. ఎక్కడ కూడా తొట్రుపాటుకు గురవడం లేదు. మొత్తం మీద సిమ్మన్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!