జార్ఖండ్ లో సంకీర్ణం..కాంగ్రెస్ కు బలం
ఒంటెత్తు పోకడలతో, దేశంలోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి జార్ఖండ్ రాష్ట్రంలో వెల్లడైన ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు లాంటిదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం సాక్షిగా ఆయా రాష్ట్రాలలో ఏర్పాటైన విపక్షాలు కొలువుతీరిన ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేయడంలో ప్రధానమంత్రి మోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా లు సిద్ద హస్తులని ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కారు ను అప్రజాస్వామిక పద్దతిలో పవర్ కోల్పోయేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయినా, జనం దృష్టిలో మాత్రం విశ్వాసం కోల్పోయిందన్నారు.
ఇదే సమయంలో దేశ ఆర్థిక రంగాన్ని శాసించే మహారాష్ట్ర లో ధర్మబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు అధికారం లోకి రాకుండా అడ్డుకున్నారని, చివరకు ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని బేషరతుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ కొన్నేళ్లుగా మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన శివసేన సైతం కమలానికి, మోదీ, అమిత్ చంద్ర షా లకు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చిందన్నారు. మరాఠా చరిత్రలో తొలిసారిగా శివసేన ప్రధాన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. మరో వైపు ప్రజా తీర్పు తమ వైపే ఉంటుందని, ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని, జార్ఖండ్ లో ఇప్పటికే పవర్లో ఉన్న బీజేపీ నానా రకాలుగా ప్రజలను ప్రభావితం చేయాలని చూసిందని దాసోజు ఆరోపించారు.
అయినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా అంతిమంగా జనమంతా న్యాయం వైపు నిలిచారని అన్నారు. ఇదే సమయంలో దేశం యావత్తు జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల వైపు చూసిందన్నారు. ప్రచురణ, ప్రసార, సామజిక మాధ్యమాలన్నీ అధికారంలో ఉన్న కమల దళానికి మద్దతుగా నిలిచినా, ఆ రాష్ట్ర ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారని వెల్లడించారు. ఇది ఒక రకంగా ప్రజాస్వామిక వాదులకు బలం ఇచ్చిందన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు మరింత శక్తిని ఇచ్చిందన్నారు. ఈ సందర్బంగా త్వరలో జార్ఖండ్ ప్రజల సాక్షిగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి, మరోసారి ముఖ్యమంత్రి పీఠం అధీష్టించ బోతున్న హేమంత్ సొరేన్ ను కాంగ్రెస్ పార్టీ తరపున అభినందిస్తున్నాని దాసోజు శ్రవణ్ తెలిపారు. కాగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయని స్పష్టం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి