జార్ఖండ్ లో బీజేపీకి షాక్

దేశాన్ని తమ కనుసన్నలతో శాసిస్తున్న మోదీ, అమిత్ చంద్ర షా పాచికలు పారడం లేదు. నిన్నటి దాకా కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ను కూలదోసిన బీజేపీకి ఇటీవలి కాలం లలిసి రావడం లేదు. అన్నిటా చక్రం తిప్పుతున్న ట్రబుల్ షూటర్ అమిత్ షాకు మహారాష్ట్రలో కోలుకోలేని రీతిలో దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది శివసేన పార్టీ. ఇదే క్రమంలో జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విస్తు పోయేలా ఫలితాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికలు ఫలితాలు కాంగ్రెస్‌, జేఎంఎం కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొత్తం మీద అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడ్డాయి. సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.

దీంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ కాబోయే సీఎం అంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలుత బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం కనబరిచినా చివరకు చాలా చోట్ల జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఒక వేళ మెజార్టీకి ఒకటీ, రెండు సీట్ల దూరంలో నిలిచినా..ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం 81 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యులు మద్దతు అవసరం కానుంది. దీంతో సోరెన్‌ మరోసారి సీఎం పీఠం అధిరోహించే అవకాశం ఉంది. కాగా ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

మాజీ ముఖ్యమంత్రి షిబు సొరెన్‌ తనయుడైన హేమంత్‌ ఎప్పుడూ సాదా సీదాగా ఉంటూ పార్టీ  ఎదుగుదలలో విశేష కృషి చేశారు. ఫలితాల నేపథ్యంలో ఆయన భార్యతో ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రజలకు జేఎంఎం నేత, కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ విజయం ఒక మైలురాయి అని అన్నారు. ఈ విజయాన్ని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు అంకితం చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌, ఇతర నేతలందరికీ తాను ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి, దాని మిత్ర పక్షాలకు మరింత బలం చేకూర్చగా బీజేపీకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!