కళ తప్పిన వజ్రాలు..కార్మికులకు కష్టాలు

ప్రపంచంలో బంగారం, వెండి, వజ్రాలకు ఉన్న డిమాండ్ ఇంకే వస్తువులకు లేదు. దీంతో తళుక్కుమనే వజ్రాలు మెరవడం మానేశాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కళ తప్పాయి. వరల్డ్ డైమండ్ మార్కెట్ లో అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ హబ్ అయిన సూరత్ లో.. లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇండియన్ ఎకానమీలో ప్రధాన భూమిక పోషించే జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. డైమండ్ మొఘల్ గా పేరున్న నీరవ్ మోడీ 14 వేల కోట్ల స్కామ్ తర్వాత ఈ ఇండస్ట్రీ పూర్తిగా పడి పోయింది. ఇక అప్పుడు మొదలైన పతనం, స్లోడౌన్ ఎఫెక్ట్‌తో మరింత కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభ మైనప్పటి నుంచి, తొలి ఏడు నెలల కాలంలో ఇండియాకు దిగుమతి అవుతోన్న ముడి సరుకు వజ్రాలు 22 శాతం వరకు తగ్గి పోయాయి. పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 18 శాతం వరకు తగ్గినట్టు జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డేటా పేర్కొంది. సూరత్‌లో జెమ్స్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న ఉద్యోగులు తగ్గి పోయారు. ప్రతిభా వంతులైన కళాకారులకూ ఆదాయాలు 70 శాతానికి పైగా తగ్గిపోయినట్టు లోకల్ ఇండస్ట్రీ ఛాంబర్స్ ప్రకటించాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీలో 50 లక్...