కార్ల లవర్స్ కు లక్కీ ఛాన్స్

కార్ల ప్రేమికులకు భలే గిరాకీ ఉంటోంది. ఈ మేరకు కార్ల తయారీ కంపెనీలు బంపర్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మారుతి  బెస్ట్​ ఆఫర్ ఆఫ్ది ఇయర్ అంటుంటే, టాటా మోటర్స్ బెస్ట్ ఇన్​డికేడ్ , హ్యుండయ్ ఇండియా డిసెంబర్ డిలైట్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా ఇండియాలో అమ్ముడు పోకుండా పేరుకు పోయిన ఆయా కంపెనీలు తమ వాహనాలను ఎలాగైనా అమ్మేయాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే ఆర్ధిక మందగమనం మరింత కొనుగోలు శక్తిని ఖీణించేలా చేస్తోంది. ఇదిలా ఉండగా మిగిలిపోయిన స్టాకులను తొందరగా వదిలించు కునేందుకు ఈ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్ల రేంజ్ 5 శాతం నుంచి 15 శాతంగా ఉంటోంది. వచ్చే జనవరి నుంచి ధరలు మరింతగా పెంచనున్నట్లు ప్రధాన ఆటోమొబైల్‌‌ కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో, కార్లను కొనడానికి ఇదే మంచి టైమని పరిశ్రమ వర్గాలు ఊరిస్తున్నాయి. సుమారుగా మా బీఎస్​4 కార్లన్నింటిని అమ్మేశాం. కొన్ని మోడల్స్‌‌పై డిస్కౌంట్‌‌లు అధికంగా ఇస్తున్నాం. ఈ డిస్కౌంట్లు తక్కువ కాలమే ఉంటాయి. సేఫ్టీ, ఎమిషన్‌ నిబంధనలు, కరెన్సీ కదలిక వంటి అంశాల వలన వచ్చే జనవరి నుంచి ధరలు అధికంగా ఉంటాయి అని మారుతి సుజుకీ చెబుతోంది. మారుతి సుజుకీ కంపెనీ 37,000–89,000 వరకు డిస్కౌంట్‌‌ను ఇస్తోంది. తక్కువగా ఈకో మోడల్‌‌కు ఇస్తుండగా, అధికంగా విటారా బ్రెజ్జాపై ఇస్తోంది. హ్యుండయ్ తన మోడల్స్ ఎలంట్రా, టస్కన్‌ పై 20,000 నుంచి 2 లక్షల వరకు డిస్కౌంట్‌‌ను ప్రకటించింది.

టాటా మోటర్స్ తన హ్యచ్‌ బ్యాక్‌ల పై 77,500 వరకు, హెక్సా పై 2.25 లక్షల వరకు డిస్కౌంట్‌‌ ఇస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న ఆఫర్లు ఈ ఏడాదిలోనే అధికమని హ్యుండయ్ ఇండియాచెబుతోంది. ఈ ఆఫర్ల వలన వాహనాల అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయ పడ్డారు. మరో వైపు కొనుగోలుదారులు మాత్రం బీఎస్‌ 6 రానున్న నేపథ్యంలో కార్ల ధరలు ఇంకా తగ్గుతాయని ఆశిస్తున్నారు. స్టాక్స్‌‌ మొత్తం వదిలించు కోవడం కంపెనీలకు తప్పనిసరి కాబట్టి, చివరి దాకా వేచి చూద్దామనే ఆలోచనే వారిలో కనబడుతోంది. కాకపోతే, నెలల తరబడి అమ్మకాలు లేని ఆటోమొబైల్‌‌ కంపెనీలు మాత్రం ఏదో రకంగా కస్టమర్లను కన్విన్స్‌‌ చేయాలని ప్రయత్ని స్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌ నుంచి బీఎస్​6 నిబంధనలు తప్పనిసరి కానున్నాయి.

కామెంట్‌లు