వ్యవసామే బెటర్ అంటున్న ఇంజనీర్

ఎవరైనా ప్రభుత్వ కొలువు వదులుకుంటారా..అలా చేస్తే అతడిని పిచ్చోడని మనం కామెంట్స్ చేస్తాం. కానీ హరీష్ దన్ దేవ్ మాత్రం నెల నెలా వచ్చే జీతాన్ని వదులుకున్నాడు కేవలం వ్యవసాయం మీదున్న ప్రేమతో. జైసల్మేర్ ప్రాంతానికి చెందిన హరీష్ ..మేధావి. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టుంది. ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేశాడు. కానీ ఎందుకనో దాని మీద ఆసక్తి తగ్గి పోయింది. 2012లో జైపూర్‌లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఢిల్లీలో ఎంబీఏ కోసం అప్లయి చేశాడు. ఇదే సమయంలో ప్రభుత్వ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూనే ఎంబీఏ చదివాడు. జూనియర్ ఇంజనీర్‌గా జైసల్మేర్ మున్సిపాలిటీలో పనిచేశాడు. రెండు నెలల పాటు పనిచేశాక సర్కార్ జాబ్ పై ఆసక్తి తగ్గింది. బికనేర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీని సందర్శించాడు హరీష్. కందులు, సిరి ధాన్యాల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ నిపుణులతో చర్చించాక ఓ నిర్ణయానికి వచ్చాడు. అలోవేరా ఫార్మింగ్ చేస్తే బావుంటుందని సూచించడంతో దానిపై దృష్టి పెట్టారు. మరింత సాగుపై అవగాహన పెంచుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వ్యవసాయ రంగంపై ఏర్పాటు చ...