వెలాసిటీదే హవా ..మెరిసిన వ్యాట్
ఇండియన్ ప్రిమియర్ లీగ్ తరహాలో మహిళల కోసం ఇండియాలో నిర్వహిస్తున్న టీ -20 ఛాలెంజ్ టోర్నీలో వెలాసిటీ జట్టు అలవోకగా నెగ్గింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో సూపర్ నోవాస్ జట్టును ఓడించిన ట్రయల్ బ్లేజర్స్ ను రెండో మ్యాచ్‌లో వెలాసిటీ ఓడించింది. బౌలర్లు తమ ప్రతిభను చూపించడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా ఏక్తా బిస్ట్ , కేర్ లు చెరో వికెట్లు తీశారు. దీంతో ట్రయల్ బ్లేజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టులో హర్లీన్ డియోల్ ఒక్కరే 43 పరుగులు భారీ స్కోర్ చేసింది. మొదటి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ స్మృతి మంధాన ఈసారి మాత్రం కేవలం 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది.
సుజీ బేట్స్ తో కలిసి హర్లీన్ ఇన్నింగ్స్ కు మంచి పునాది వేసినా..ఆ తర్వాత ఆమెకు సరైన సహకారం అందలేదు. ఛేదనలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డేనియలీ వ్యాట్ , షఫాలీ వర్మ సత్తా చాటడంతో ఒక దశలో రెండు వికెట్లు కోల్పోయి 111 పరుగుల వద్ద నిలిచింది. అయితే విజయానికి మరో రెండు పరుగులే కావాల్సిన సమయంలో ఆ జట్టు దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ ధాటికి అనూహ్యంగా అయిదు వికెట్లును కోల్పోయింది. 18వ ఓవర్లో చివరి బంతికి సుశ్రీ మరో రెండు పరుగులు చేసి వెలాసిటీకి చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. సూపర్ నోవాస్ జట్టుతో వెలాసిటీ జట్టు తలపడనుంది.
ట్రయల్ బ్లేజర్స్ జట్టు ధాటిగా ఆడేందుకు ప్రయత్నం చేసినా..వెలాసిటీ జట్టు బౌలర్లు దీప్తి, డియోల్‌లు పరుగులు చేయకుండా కట్టడి చేయగలిగారు. ఆరు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేయగా..డియోల్ 43, బేట్స్ 26, మంధాన 10 పరుగులు మాత్రమే చేశారు. బిష్ట్ 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా..అమేలియా కేర్ 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. శిఖ పాండే కీలకమైన వికెట్ పడగొట్టింది. ఇక వెలాసిటీ జట్టులో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. వ్యాట్ 46 పరుగులు చేయగా వర్మ 34 పరుగులతో మెరిసింది. శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా డియోలో మరో వికెట్ కూల్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి