ఫోర్బ్స్ మెచ్చిన ఫెవికోల్ మ్యాన్ - వేలాది మందికి బతుకునిచ్చిన పారేఖ్
ఫెవికోల్ పేరు చెబితే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. అంతలా పాపులర్ అయ్యింది ఈ ప్రొడక్ట్. ఇది లేకుండా ఇపుడు నిర్మాణ రంగం ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఒకప్పుడు ప్యూన్ గా పనిచేసిన బలవంత్ పారేఖ్ ..ఇపుడు కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు. ఫెవికోల్ మెన్ గా ఆయనను ఆప్యాయంగా పిలుస్తారు. ఆయన సాగించిన జర్నీ గురించి తెలుసు కోవాలంటే ఈ కథ తప్పక చదవాల్సిందే. 1959లో పిడిలైట్ ఇండస్ట్రీస్ ను స్థాపించాడు పారేఖ్. ఇండియన్ మార్కెట్‌లో ఆయన ప్రారంభించిన కంపెనీ వాటా 75 శాతానికి పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు దాని మహత్తు ఏమిటో. గుజరాత్ లోని భవ్‌నగర్ జిల్లా మహువా గ్రామంలో పారేక్ జన్మించారు. న్యాయ విద్య అభ్యసించాలని ముంబయి వెళ్లారు. మధ్యలోనే చదువు ఆపేశారు.
గుజరాత్‌లో మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా మూవ్ మెంట్‌లో పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. లా డిగ్రీ పూర్తి చేశాక..న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ముంబయిలో బతకడం కష్టంగా మారడంతో ...డయింగ్, ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు. అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. వుడ్ ట్రేడర్స్ కార్యాలయంలో ప్యూన్ గా చేరాడు. వేర్ హౌస్‌లో చిన్నపాటి స్థలంలో భార్యతో కలిసి జీవించారు పారేఖ్. ప్యూన్‌గా పనిచేస్తున్న సమయంలో పారేఖ్ లో ఉన్న వ్యాపార ప్రతిభను మరో వ్యాపారవేత్త గుర్తించారు. ఇతర దేశాల నుంచి సైకిళ్లు, పేపర్ డైస్ ను అమ్మడం ప్రారంభించాడు తన తమ్ముడు సుశీల్ పారేఖ్‌తో కలిసి. దీని పేరు మీదే పిడిలైట్ ఇండస్ట్రీస్ గా నామకరణం చేశాడు. ఇదే పేరుతో ఒకే ఒక్క ప్రొడక్ట్ తయారు చేశాడు అదే ఫెవికోల్. కొన్నేళ్ల తర్వాత మెల మెల్లగా ఫెవికోల్ కు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.
నిర్మాణ రంగంలో, ఇంటి నిర్మాణాల్లో , వుడ్ వర్క్స్ లలో ఫెవికోల్ లేకుండా పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఫెవికోల్ ప్రొడక్ట్ కు డిమాండ్ పెరగడంతో ఇదే కంపెనీ నుంచి పారేఖ్..ఫెవికిక్, ఎం..సిల్ పేరుతో మరో రెండు వస్తువులను రిలీజ్ చేశాడు. భారతీయ మార్కెట్‌లో 70 శాతం వాటాను దక్కించుకున్నారు. 2006 నుండి అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌లోకి ప్రవేశించింది. అమెరికా, థాయిలాండ్, దుబాయి, ఈజిప్ట్ , బంగ్లాదేశ్ దేశాలతో పాటు సింగపూర్‌లో కంపెనీలను స్థాపించింది. తన జన్మకు కారణమైన తన ఊరుకు ఆయన ఎన్నో సేవలందించారు. స్వంత ఖర్చులతో ఊరులో రెండు పాఠశాలలు, ఒక కాలేజీ తో పాటు అందరికి ఉచితంగా ఆరోగ్యం అందించేందుకు ఏకంగా హాస్పిటల్ ను నిర్మించారు.
సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే లక్ష్యంగా దర్షక్ ఫౌండేషన్ ను స్థాపించారు పరేఖ్. గుజరాత్ కల్చరల్ హిస్టరీని స్టడీ చేస్తుంది ఈ సంస్థ. భవా నగర్ సైన్స్ సిటీ ప్రాజెక్టు కోసం 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బల్వంత్ పారేఖ్ సెంటర్ ఫర్ జనరల్ సెమాటిక్స్ అండ్ అదర్ హ్యూమన్ సైన్సెస్ పేరుతో స్థాపించారు. 88 ఏళ్ల వయస్సున్నపుడు 2013లో ఈ లోకాన్ని వీడారు పారేఖ్. ఫోర్బ్స్ ఏసియా ప్రకటించిన రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో బల్వంత్ పారేఖ్ పేరు కూడా ఉంది. భౌతికంగా ఆయన లేక పోయినా ..ఫెవికోల్ బంధం అలాగే ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి