లోకాన్ని ఆవిష్కరించే లెన్స్ ..ఫ్లికర్

వేయి మాటలు ఇవ్వలేని ఆనందాన్ని..పది కాలాల పాటు గుర్తుంచుకోదగిన స్పర్శను ..తరాల పాటు వెంటాడే చూపుల్ని కట్టిపడేసేది ఒక్కటే కెమెరా. ఆధునికంగా పెను మార్పులు చోటు చేసుకున్నా ఇమేజెస్ విషయంలో తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక..ఆండ్రాయిడ్ టెక్నాలజీ వాడుతుండడంతో ఫోటోలు దిగడం మామూలై పోయింది. లైఫ్‌ను మరింత అందంగా..నేచర్‌ను మరింత అర్థవంతంగా ..సొసైటీని లెన్స్‌లలో చూపించగలిగే సాధనం కెమెరానే. సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ టాలెంట్ కు ..క్రియేటివిటీకి అద్భుతమైన ప్లాట్ ఫారమ్స్ ఏర్పడ్డాయి. కష్టపడకుండానే కరెన్సీని ఖాతాల్లో జమ చేసుకునే అవకాశాలు కోకొల్లలు. కావాల్సిందల్లా కనెక్టివిటీ కలిగి ఉండడమే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు..టాలెంట్ అందరికీ ఒకేలా వుండదు. పోటీ ఉన్న చోటే మనం ఏమిటో ..మన సత్తా ఏమిటో తేలుతుంది. అందుకే కాంపిటిషన్ కంపల్సరీ చేశారు. ఏ సంస్థ అయినా లేక ఏ వ్యవస్థ అయినా ముందుగా నిర్ణయించేది మనం కరెక్టుగా ఉన్నామా లేదా ..ఒడిదుడుకులను తట్టుకుంటారా లేక వెనుదిరిగి వెళ్లిపోతారా..సంస్థను విశ్వసిస్తారా..మధ్యలోనే ట...