లోకాన్ని ఆవిష్కరించే లెన్స్ ..ఫ్లికర్
వేయి మాటలు ఇవ్వలేని ఆనందాన్ని..పది కాలాల పాటు గుర్తుంచుకోదగిన స్పర్శను ..తరాల పాటు వెంటాడే చూపుల్ని కట్టిపడేసేది ఒక్కటే కెమెరా. ఆధునికంగా పెను మార్పులు చోటు చేసుకున్నా ఇమేజెస్ విషయంలో తన హవాను కొనసాగిస్తూనే ఉన్నది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక..ఆండ్రాయిడ్ టెక్నాలజీ వాడుతుండడంతో ఫోటోలు దిగడం మామూలై పోయింది. లైఫ్‌ను మరింత అందంగా..నేచర్‌ను మరింత అర్థవంతంగా ..సొసైటీని లెన్స్‌లలో చూపించగలిగే సాధనం కెమెరానే. సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ టాలెంట్ కు ..క్రియేటివిటీకి అద్భుతమైన ప్లాట్ ఫారమ్స్ ఏర్పడ్డాయి. కష్టపడకుండానే కరెన్సీని ఖాతాల్లో జమ చేసుకునే అవకాశాలు కోకొల్లలు. కావాల్సిందల్లా కనెక్టివిటీ కలిగి ఉండడమే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు..టాలెంట్ అందరికీ ఒకేలా వుండదు. పోటీ ఉన్న చోటే మనం ఏమిటో ..మన సత్తా ఏమిటో తేలుతుంది. అందుకే కాంపిటిషన్ కంపల్సరీ చేశారు.
ఏ సంస్థ అయినా లేక ఏ వ్యవస్థ అయినా ముందుగా నిర్ణయించేది మనం కరెక్టుగా ఉన్నామా లేదా ..ఒడిదుడుకులను తట్టుకుంటారా లేక వెనుదిరిగి వెళ్లిపోతారా..సంస్థను విశ్వసిస్తారా..మధ్యలోనే టాటా చెప్పేస్తారా..ఇవ్వన్నీ చూడటం మామూలే. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోతే ఎలా..? ఐటీ పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ కలిగిన వారికి దారులు ఏర్పడ్డాయి. అపారమైన అవకాశాలు వారిని తలుపు తట్టాయి. ఒకప్పుడు 50 వేలు సంపాదిస్తే వారిని గొప్పవారిగా చూసే వాళ్లం. ఇపుడు 15 ఏళ్లకే లక్షలు సంపాదించేస్తున్నారు. చిన్నారులని చులకనగా చూసే రోజులు పోయాయి. వాళ్లు కూడా వండర్ కిడ్స్ గా తయారయ్యారు. తమకంటూ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ఏకంగా సోషల్ మీడియాను ఏలుతున్నారు. పిల్లల్లోని టాలెంట్‌ను గుర్తించిన కంపెనీలన్నీ ఇపుడు వారి కోసం ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేసే పనిలో పడ్డాయి. పిల్లలు ఏడ్వకుండా ఉండేందుకు తయారు చేసిన ఆట వస్తువుల వ్యాపారం ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది. ఈ ఒక్క రంగంలోనే చైనా అమెరికాను దాటేసింది. డాలర్ల పంట పండిస్తోంది.
ఏ వస్తువైనా సరే క్షణాల్లో తయారు చేసి మార్కెట్‌లో రిలీజ్ చేసే కెపాసిటీని ఆ దేశం సాధించింది. ఇందుకు అక్కడి వారి మేధోశక్తిని మెచ్చుకోవాల్సిందే. కొనుగోలు శక్తి ఏ మేరకు ఉందో..మొత్తం మార్కెట్‌లో తమ వాటాను ఎలా కాపాడుకుంటూ రావాలో చైనాకు తెలిసినంతగా ఇంకే దేశానికి తెలియదు. ప్రతి వస్తువును తయారు చేసే సత్తాను సంపాదించింది ఆ దేశం. ఇండియన్ మార్కెట్‌ను చైనా వస్తువులు ముంచెత్తుతున్నాయి. కొందరు వ్యాపారస్తులు ఇండియాలోనే తయారు చేసి చైనా పేరు తగిలించి అమ్ముతున్నారు. కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. తక్కువ ధరలకే లభిస్తుండడం..ఒక వస్తువు కొంటే మరొకటి వస్తువు ఫ్రీగా ఇస్తుండడంతో జనం ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. ఓ వైపు మార్కెట్ ఇంకో వైపు సోషల్ మీడియా ప్రపంచాన్ని తమ గుప్పిట్లో వుంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచాన్ని ఆవిష్కరించే పనిలో ఫ్లికర్ అన్నింటికంటే ముందంజలో ఉంటోంది. ఒక్కసారి ఇందులోకి ఎంటరైతే చాలు మనల్ని మనం మరిచి పోతాం. అంతలా ఆకట్టుకుంటోంది ఈ పోర్టల్. రోజుకు లక్షల్లో ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా అప్ లోడ్ అవుతుంటాయి. ఇదే దీని ప్రత్యేకత.
భావోద్వేగాలు..ఆనందకర క్షణాలు..సంతోషకరమైన సన్నివేశాలకు ఇక్కడ కొదువలేదు. అంతలా పాపులర్ అయిపోయింది ఫ్లికర్. ఇమేజ్ హోస్టింగ్‌తో పాటు వీడియో హోస్టింగ్ సర్వీస్ గా దీనిని ప్రారంభించారు. లుడికార్ప్ 2004లో దీనిని ఏర్పాటు చేశారు. 2018 ఏప్రిల్ నుండి దీని ఓనర్ షిప్ స్మగ్‌మగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2013 వరకు ఫ్లికర్‌లో 87 మిలియన్ల మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇదో రికార్డుగా మిగిలి పోయింది. 3.5 మిలియన్ల ఫోటోలు (ఇమేజెస్ ) ప్రతి రోజు ఇందులోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి దాకా 7 బిలియన్ల ఇమేజెస్ నిక్షిప్తమై ఉన్నాయి. ఫోటోలతో పాటు వీడియోలు పోస్ట్ చేసేందుకు ఇందులో అనుమతి ఇస్తున్నారు. ఈమెయిల్ అకౌంట్ వుంటే చాలు ఇందులో ఉచితంగా చేరొచ్చు. స్వంతంగా మనకు నచ్చిన ఫోటోలతో పాటు వీడియోలు రూపొందించి ఇందులో పోస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంకొకరు మనల్ని జడ్జ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా మీకు మీరే బాస్ అన్న రీతిలో ఇందులో మీ క్రియేటివిటికి పదును పెట్టొచ్చు. ఓ రకంగా ఇండిపెండెంట్‌గా మీకు మీరే బాస్.
మనల్ని మనం ఆవిష్కరించుకునే క్షణాలు లైఫ్‌లో చాలా అరుదుగా వస్తాయి. ఆ క్షణాలు వెళ్లిపోతే మళ్లీ తెచ్చుకోలేం. ఇందుకోసమే కెమెరాలు మన చెంత వుంటే ఇంకేం లోకమే వాకిలిగా మారి పోతుంది. మనం బతుకు మైదానం మీద హాయిగా సంచరించవచ్చు. ఎంచక్కా ప్రయాణిస్తూ ప్రపంచాన్ని మనలోకి చేర్చుకోవచ్చు. పదికాలాల పాటు భద్రపరుచుకునేలా చేస్తోంది ఫ్లికర్. నిర్వాహకులు మొబైల్ యూజర్స్ కోసం ప్రత్యేకంగా యాప్ ను క్రియేట్ చేసింది. సెల్ఫీ తీసుకోవడం..అందులోంచే పంపించేయడం క్షణాల్లో జరుగుతుంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఇతర ఫ్లాట్‌ఫారమ్స్ మీద దీనిని ఉచితంగా వాడుకోవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఫ్లికర్ మోస్ట్ పాపులర్ అయిపోయింది. మిలియన్ల కొద్దీ జనం ఇందులో చేరారు. వ్యూవర్స్‌తో పాటు జాయిన్ అయ్యే వాళ్లు పెరగడంతో సైట్‌కు విపరీతంగా వ్యూవర్ షిప్ పెరిగింది. గూగుల్‌లో మిగతా సామాజిక మాధ్యమాలకు పోటీగా నిలిచింది.
ఓ వైపు అన్ని సైట్లు ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకునే సదుపాయాలను కల్పిస్తున్నాయి. దేనికదే స్పెషాలిటీ. ఇన్‌స్టాగ్రాం..టంబ్లర్..తో పాటు ఫ్లికర్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్‌కోలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. అలెక్సా ర్యాంకింగ్‌లో 318వ స్థానంలో ఉంది. మీకంటూ అభిరుచి వుంటే చాలు..ఫోటోలతో పాటు వీడియోలు తీసి ఇందులో పెడితే చాలు ఏదో ఒకరోజు మీతో మరొకరు అనుసంధానం అయ్యే అవకాశం లేకపోలేదు. ఇంకెందుకు ఆలస్యం..ఫ్లికర్‌లో సభ్యులై పోవడం..మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవడమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి