ప్రభాస్ భళారే ..సాహో సూపరే..!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అంచనాలకు అందకుండా సంచనాలు సృష్టిస్తున్న ఒకే ఒక్క సినిమా సాహో నిన్నటి దాకా రాజమౌళి బాహుబలి రికార్డులు తిరగ రాస్తే , ఇప్పుడు సుజిత్ రెడ్డి తీసిన ఈ మూవీ రికార్డుల సునామీ రేపుతోంది. టాలీవుడ్ లో ఇప్పటి దాకా హాలీవుడ్ రేంజ్ లో ఇలాంటి సినిమాను ఏ డైరెక్టర్ తీయలేక పోయాడు. కంట్రీ అంతటా ఈ మూవీ గురించిన చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినీ జనాలకు, ఫ్యాన్స్ కు జీవితం లో మరిచి పోలేని రీతిలో కిక్ ఇచ్చాడు. తన పేరు మీదున్న రికార్డులను తానే అధిగమించాడు, ఈ పాన్ ఇండియన్ స్టార్. హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్టర్ సుజీత్ రెడ్డి తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా చేయని రీతిలో సాహో ను 10 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే వారం రోజుల వరకు అన్ని థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయని అభిమానులు వాపోతున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో సుజీత్ రూపొందించాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ న్యూస్ మేకర్ గా మారి పోయాడు.బాడీ పరంగా సిల్వర్ స్టోలెన్ ను తలపించే ప్రభాస్ తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా...