ప్రభాస్ భళారే ..సాహో సూపరే..!

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అంచనాలకు అందకుండా సంచనాలు సృష్టిస్తున్న ఒకే ఒక్క సినిమా సాహో నిన్నటి దాకా రాజమౌళి బాహుబలి రికార్డులు తిరగ రాస్తే , ఇప్పుడు సుజిత్ రెడ్డి తీసిన ఈ మూవీ రికార్డుల సునామీ రేపుతోంది. టాలీవుడ్ లో ఇప్పటి దాకా హాలీవుడ్ రేంజ్ లో ఇలాంటి సినిమాను ఏ డైరెక్టర్ తీయలేక పోయాడు. కంట్రీ అంతటా ఈ మూవీ గురించిన చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినీ జనాలకు, ఫ్యాన్స్ కు జీవితం లో మరిచి పోలేని రీతిలో కిక్ ఇచ్చాడు. తన పేరు మీదున్న రికార్డులను తానే అధిగమించాడు, ఈ పాన్ ఇండియన్ స్టార్. హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో డైరెక్టర్ సుజీత్ రెడ్డి తెరకెక్కించాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమా చేయని రీతిలో సాహో ను 10 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే వారం రోజుల వరకు అన్ని థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయని అభిమానులు వాపోతున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో సుజీత్ రూపొందించాడు. ఒక్కసారిగా ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ న్యూస్ మేకర్ గా మారి పోయాడు.బాడీ పరంగా  సిల్వర్ స్టోలెన్ ను తలపించే ప్రభాస్ తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా ఇదే కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నిర్మాతలు. అయితే మొత్తం సినిమాకు ఖర్చు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

టీజర్, సినిమా ప్రమోషన్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయ్యింది. ఇప్పటి దాకా కేవలం 18 సినిమాలు తీసాడు ప్రభాస్. కానీ ఒకే ఒక్క సినిమా నటించిన బాహుబలి అతడిని బ్లాక్ బ్లస్టర్ హీరోగా నిలిచేలా చేసింది. కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ సుజీత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. ఇంకో హీరో అయితే ఒప్పుకోడు. బాహుబలి సక్సెస్ తర్వాత భారీ అంచనాలతో పాటు విపరీతమైన వత్తిడి పెరిగింది. కానీ ప్రభాస్ అలా కాదు ..మోస్ట్ పాజిటివ్ నేచర్ కలిగిన వ్యక్తి కావడంతో ఈజీగా తీసుకున్నాడు. భారీ రేంజ్ లో సాహో రే అనే రీతిలో తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా మొదటి రోజే 70 కోట్లు వసూల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంచనా. ఏది ఏమైనా ఇది డార్లింగ్ బాయ్ , సుజీత్ సినిమా..తెలుగువారు గర్వించ దగ్గ సినిమా. 

కామెంట్‌లు