అరవై ఏళ్ళ నవ మన్మధుడు

పట్టుమని ముప్పై ఏళ్లకే జవసత్వాలు కోల్పోతున్న ఈ తరుణంలో అతను మాత్రం 60 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా నవ మన్మధుడిగానే అలరిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ బ్రాండ్ ను, ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నాగార్జున అక్కినేని. నవరసాలను పలికించే అతికొద్ది మంది నటుల్లో నాగ్ ఒకరు. అక్కినేని నాగేశ్వర్ రావు రెండో కుమారుడు ఆయన. నట వారసత్వం పుణికి పుచ్చుకున్నా ఏ రోజు ఎవ్వరిని అనుకరించ లేదు. అటు మహిళలు ఇటు యూత్ అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ పెదవుల మీద చిరునవ్వు చిందిస్తూ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. యాక్టర్ గా , బిజినెస్ మెన్ గా, యాంకర్ గా ఇలా ప్రతి ఫార్మాట్ లో నాగ్ సక్సెస్ అయ్యారు.

డ్రెస్సెస్ ఎంపిక దగ్గరి నుంచి, ప్రతి పనిలో , నటనలో రిచ్ నెస్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఎన్నో సినిమాలు నటించినా చాలా మూవీస్ జనాన్ని ఎంటర్ టైన్ చేసాయి. నాగ్ కెరీర్లో మన్మధుడు అతి పెద్ద హిట్. దానికి సీక్వెన్స్ గా తాజాగా మన్మధుడు -2 విడుదలైంది. ఆ సినిమా కంటే ఈ కొత్త సినిమాలో నాగార్జున మరింత అందంగా, రొమాంటిక్ గా కనిపించారు. ముద్దులు హద్దు మీరినా నాగ్ కోసం మహిళలు వెళ్లడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. పెళ్లి చేసుకోక ఇబ్బంది పడే పాత్రలో నాగ్ ఒదిగి పోతే ..రకుల్ ప్రేమికురాలి పాత్రలో జీవించింది. 1959 ఆగస్టు 29 న చెన్నైలో జన్మించారు. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. నటుడు వెంకటేష్ సోదరితో పెళ్లయింది. కొన్ని కారణాలతో విడాకులు పొందారు.

రామ్ గోపాల్ వర్మ తీసిన శివ అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగు సినిమాను షేక్ చేసింది. రికార్డులను పటాపంచలు చేసింది. అందులో నాగ్ రియల్ హీరో. మూస ధోరణికి అలవాటు పడిన తెలుగు వారికి సినిమా పవర్ ఏమిటో రుచి చూపించాడు ఆర్జీవి. భక్తుడి పాత్రలో చేసిన అన్నమయ్య అతి పెద్ద హిట్టు. ఆ తర్వాత శ్రీరామదాసు సక్సెస్ గా నడిచాయి. మణిరత్నం గీతాంజలి , కృష్ణవంశీ తీసిన నిన్నే పెళ్లాడుతా , ఈవీవీ తీసిన హలో బ్రదర్ కూడా బిగ్ హిట్ గా నిలిచాయి. మొత్తం మీద సినీ జర్నీలో నాగ్ ది ప్రత్యేకమైన స్తానం ఉంది. ఈ మన్మధుడికి అరవై ఏళ్ళు అంటే నమ్మగలమా. చిరునవ్వు తో పాటు పాజిటివ్ గా ఉండే నాగ్ ఇలాగే అలరించాలని కోరుకుందాం. 

కామెంట్‌లు