ఈటెల తూటాలు..మాటల మంటలు..!

తెలంగాణాలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన మాటల తూటాలు పేల్చారు. దీంతో గులాబీ దళంలో మంత్రి చేసిన మాటలు మంటలు రేపాయి. తాజాగా త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు ఉంటాయని, ఉత్తర తెలంగాణలో సీనియర్ నాయకుడిని మారుస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సీరియస్ గా తీసుకున్న ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సంచలనం కలిగించింది. తాను ఆరిపోయే దీపాన్ని కాదాని, వెలిగే దీపాన్ని అని ఈటెల అన్నారు.

తాను ఎవరి నుంచైనా 5 వేల రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే, రాజకీయాల నుంచి ఇప్పుడే తప్పుకుంటానని చెప్పారు. తనపై కొన్ని ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై వచ్చిన వార్తల పట్ల కలత చెందారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. ఉద్యమ సమయం నుంచి తెరాసతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి సాయం చేశానని ఈటెల చెప్పారు.15 ఏళ్లలో తాను ఏ ఒక్కరి నుంచీ డబ్బులు తీసుకోలేదని చెప్పారు. మంత్రి పదవి తనకు భిక్ష కాదని.. ఆ పదవి కోసం తాను కులం పేరుతో కొట్లాడలేదని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మాత్రమే తాను పోరాటం చేశానని అన్నారు.

నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినప్పుడు చంపుతావా అని ఎదురెళ్లి ఛాలెంజ్ చేశానని ఈటెల చెప్పారు. తాను అనామకుడిగా రాజకీయాల్లోకి వచ్చి స్వయం కృషితో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రలోభాలకు, బెదిరింపులకు తాను లొంగలేదని.. తెలంగాణ కోసం లక్షలాది మంది ప్రజలతో కలిసి ఉద్యమం చేశానని చెప్పారు. మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల గెలుపు కోసం ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అందుకే తాము గులాబీ జెండా యజమానులమని అన్నారు. అడుక్కునేవాళ్లం కాదు.. అడుక్కునే వారు ఎవరో తెలుస్తుంది అని ఈటల వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమన్నారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని.. ప్రజలే చరిత్ర నిర్మాతలని అన్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!