జనం జనసంద్రం..పవన్ ప్రభంజనం

జనమే జనం ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. ఊహించని రీతిలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భావ సారూప్యత కలిగిన మేధావులు, వ్యక్తులు, సంస్థలతో పవన్ కళ్యాణ్ ముందు నుంచి కలిసి నడుస్తున్నారు. పవన్ వెన్నంటి అపార రాజకీయపరమైన అనుభవం కలిగిన నాదెండ్ల మనోహర్ ఉండనే ఉన్నారు. పవన్ చిటికె వేసినా..లేదా మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కొద్ది శాతం తేడాతో అధికారంలోకి వచ్చింది. బీజేపీతో చెలిమి కూడా లాభించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారింది. తెలుగుదేశం పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనదైన శైలితో పాదయాత్ర చేపట్టారు. తానే పవర్లోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుండి టికెట్లు దక్కని వారంతా జగన్ పంచన చేరారు. అన్ని పార్ట...