జనం జనసంద్రం..పవన్ ప్రభంజనం
జనమే జనం ఎటు చూసినా జనమే. ఇసుక వేస్తే రాలనంత జనం. ఊహించని రీతిలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భావ సారూప్యత కలిగిన మేధావులు, వ్యక్తులు, సంస్థలతో పవన్ కళ్యాణ్ ముందు నుంచి కలిసి నడుస్తున్నారు. పవన్ వెన్నంటి అపార రాజకీయపరమైన అనుభవం కలిగిన నాదెండ్ల మనోహర్ ఉండనే ఉన్నారు. పవన్ చిటికె వేసినా..లేదా మాట్లాడినా తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కొద్ది శాతం తేడాతో అధికారంలోకి వచ్చింది. బీజేపీతో చెలిమి కూడా లాభించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ మారింది. తెలుగుదేశం పార్టీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనదైన శైలితో పాదయాత్ర చేపట్టారు. తానే పవర్లోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుండి టికెట్లు దక్కని వారంతా జగన్ పంచన చేరారు.
అన్ని పార్టీల కంటే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే టీడీపీ బాస్ చంద్రబాబు మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సమయం తక్కువగా ఉండడం..తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్..జగన్ ..చంద్రబాబుల మధ్య ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా పరంగా టాప్ రేంజ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వారితో మమేకమవుతూ జనసేన అధికారంలోకి వస్తే జనం మధ్యనే ఉంటూ సుపరిపాలన అందజేస్తామని అంటున్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. పవన్‌ను టీడీపీ నేతలకంటే వైసీపీ కార్యకర్తలు, నాయకులు టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
దీనిని లైట్ తీసుకున్న పవన్ ..తాను ఎవ్వరి జోళికి వెళ్లనని..తనను టార్గెట్ చేస్తే తాట తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. లక్షలాది మంది అభిమానులను..స్వంత కేడర్ ను కలిగి ఉండడం పవన్ కళ్యాన్‌కు మరింత బలాన్ని ఇస్తోంది. రాయలసీమలో కరువు నివారణ, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం చూపడం, సాగు , తాగు నీటిని ఎళ్లవేలలా అందించడం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు తావీయకుండా లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేస్తూ చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు పవన్ . ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో సభల్లో టీడీపీ, వైసీపీ పార్టీలను టార్గెట్ చేశారు. మాజీ డీజీపీ లక్ష్మినారాయణ పవన్ తో కలవడం సంచలనం రేపింది. ఆంధ్రలోని ప్రధాన నియోజకవర్గాలలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట మార్చిన బీజేపీని వదలడం లేదు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని..కానీ కొందరు నేతలు ఆంధ్రుల పేరు పెట్టి తిట్టడాన్ని తాను సహించనన్నారు.
రెండేళ్లు జైలుకు వెళ్లిన జగన్ తనను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. సమాజంలో అందరు బాగుండాలని తాను పాలిటిక్స్‌లోకి వచ్చానని చెప్పారు. తాను టీడీపీతో కలిసి ఉన్నానని వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నారని..ఇది మంచి పద్ధతి కాదన్నారు. జైలుకు పోతానన్న భయంతో జగన్ మోడీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. జనమే తనకు బలమని ..ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేశానని చెప్పారు. కేసీఆర్ కు వంత పాడటం సిగ్గు చేటన్నారు. తోలు తీసే భాష తనకూ వచ్చన్నారు. ఎంతకాలం తెలుగుదేశం పల్లకీలు, వైసీపీకి ఎంత కాలం పల్లకీలు పని చేస్తారని పవన్ నిలదీశారు. ఆంధ్రా వాళ్లను తిడిపే జగన్‌కు పౌరుషం రావడం లేదా అని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వని అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారని జగన్, బాబును నిలదీయాలని పిలుపునిచ్చారు.
మొత్తం మీద పవర్ స్టార్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పలుకుతున్నారు. మార్పు కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప పదవులు అనుభవించడానికి కాదన్నారు. జన సైనికులు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కొనియాడారు. సైకిల్ చెయిన్ తెగి పోయిన పార్టీ టీడీపీని అభివర్ణించారు. తెలుగుదేశానికి అంత స్కోప్ లేదన్నారు. జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం, జనసేన రూపంలో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో ద్విముఖ పోరు కంటే త్రిముఖ పోరు నెలకొంది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు పవర్ లోకి వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి