వారెవ్వా నీరా..మస్తు..జబర్దస్తు..?

బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇపుడు కొలువుల జాడ లేక పోగా..తాగడంలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్‌లోకి వచ్చేటట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి వేల కోట్లకు పైగా తాగి తందానాలు ఆడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన మహానుభావులు అందినంత మేర ..ముందస్తుగానే కేసులను బుక్ చేసుకున్నారు. ఓటర్లకు పైసలు ఇచ్చుడు..తాగుడు షురూ చేయడంతో జనం జై తెలంగాణ అన్నరు. ఇంకేం ఐదేళ్లకు లైసెన్స్ దొరికిందని సర్కార్ భలే ముచ్చట పడుతున్నది. ఇక అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఆగడాలకు చెప్పనీక లేదు. ఎక్కడ దొరక పడితే అక్కడ నోట్ల కట్టలు బట్టబయలు అవుతున్నవి. పాడుగాను..ఓ వైపు మా భూములు మా పేర్ల మీద రాయకుండ లంచం అడుగుతున్నరంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకుంట లేరు. ఊర్లల్ల బ్యాంకుల పడ్డ పైసలన్నీ కల్లు దుకాణాలు, మద్యం షాపులకు చేరుతున్నయి. మస్తుగ తాగుతున్నరు..సోయి లేకుండా పండుతున్నరు. ఇపుడు తెలంగాణ సర్కార్ మరో ప్లాన్ కు తెర తీసింది. త్వరలో నీరా పాలసీ తీసుకు రావాలని అనుకుంటోంది. సాధ్యమవుతుందా లేదా అని సూడుండ్రంటూ...