అంచనాలు మించిన ఫలితాలు .. ఆనంద డోలికల్లో ఉద్యోగులు
ఓ వైపు ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంటే మరో వైపు పొరుగు సేవలను అందిస్తూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న ఇండియాకు చెందిన ఇన్ఫోసిస్ కంపెనీ ఆశించిన దానికంటే గణనీయమైన ఫలితాలను అందుకుంది. ఓ రకంగా మార్కెట్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది ఈ కంపెనీ. మొదటి నుంచి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఐటీ దిగ్గజ కంపెనీ, విలువలకు పెద్ద పీట వేస్తూ..చాప కింద నీరులా ఐటీ రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ భద్రతతో పాటు మహిళలకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది ఈ కంపెనీ. దీంతో టెక్కీలు, ఐటీ ఎక్స్ పర్ట్స్ అంతా ఇన్ఫోసిస్ కంపెనీకే తమ మొదటి ప్రయారిటీని ఇస్తున్నారు.
ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2019 - 2020 వ సంవత్సరం తొలి మూడు నెలలకు గాను కన్సాలిడేటెడ్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన చూస్తే ..3 వేల 802 కోట్లతో 5.2 శాతంగా నమోదైంది. ఇది కంపెనీ పరంగా చూస్తే అరుదైన రికార్డుగానే భావించాలి. గత నెలతో ముగిసిన మూడు నెలల్లో ఇన్ఫోసిస్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21 వేల 803 కోట్లకు చేరుకుని 13.9 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 19 వేల 128 కోట్లుగా ఉండగా ..ఈ ఏడాది చూస్తే 1.2 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధి అంచనాను కంపెనీ 8.5 నుంచి 10 శాతానికి పెంచింది. నిర్వహణ మార్జిన్ అంచనాను మాత్రం 21 నుంచి 23 శాతంగానే కొనసాగించింది. మరో వైపు డాలర్ల పరంగా చూసినా ఇన్ఫోసిస్ తన హవాను కొనసాగించింది. యుఎస్ కరెన్సీ ఆదాయం 54.6 కోట్ల డాలర్లుగా నమోదు కాగా గత ఏడాది ఇదే కాలానికి 53.4 కోట్ల డాలర్ల లాభం గడించింది.
మార్కెట్ పరంగా ఆదాయ పరంగా చూస్తే, 283 కోట్ల డాలర్ల నుంచి 313 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇంకో వైపు ఇన్ఫోసిస్ డిజిటల్ సేవల విభాగంలో కూడా ఆదాయం సమకూరింది. ఇది కూడా కంపెనీకి అడ్వాంటేజ్. ఈ విభాగంలో 111.9 కోట్ల డాలర్లుగా నమోదు కావడంతో కంపెనీ యాజమాన్యం ఆశ్చర్యానికి గురైంది. మొత్తం ఆదాయంలో ఈ సెక్టార్ దే 35.7 శాతం అత్యధిక వాటాను కలిగి ఉంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం శాతం చూస్తే 41.9 శాతం కాగా ..మూడు నెలల కాలానికి 8.6 శాతం వృద్ధి రేటును పెంచుకుంది. అటు సేవల రంగంలోను ఇటు డిజిటల్ రంగంలోను ఊహించని ఆదాయం రావడంతో ..వాటా దారులకు ఏటా నగదు నిల్వల్లో 70 శాతం వరకు పంచాలన్నది కంపెనీ పాలసీగా పెట్టుకుంది. మదుపు దారులకు మరింత ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం మీద కంపెనీకి ప్రాఫిట్ దక్కడంతో..ఇండియాలో 18 వేలకు పైగా ఈ ఏడాది కొత్తగా నియామకాలు చేపడతామని వెల్లడించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి