అందరి చూపు ఐటీ కోర్సులపైనే - స్టూడెంట్స్ ప్రయారిటీ వీటికే
ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల దెబ్బకు స్టూడెంట్స్ ఏం చదవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎనలేని డిమాండ్ పెరగడంతో వీరి ప్రాధాన్యత దీనిపైనే ఉంటోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షను నిర్వహించింది. మరో వైపు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష కంటే ముందే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలను చేపట్టింది. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటిహెచ్ అండ్ ఐఐటిబి క్యాంపస్‌లతో పాటు మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు స్టూడెంట్స్ ను వడపోత పోశాయి. వారు కనబర్చిన ప్రతిభ ఆధారంగా మార్కులతో పాటు ర్యాంకులను ప్రకటించింది. తాజాగా టీఎస్ ఎంసెట్‌ను ఈసారి జవహరల్ లాల్ నేషనల్ టెక్నాలజీ యూనివర్శిటీ పరీక్ష నిర్వహించింది. ఆయా సీట్లు, ఫీజులు, కోటాలను కేటాయిస్తూ సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది.
ఎంసెట్ సీట్ల మొదటి విడత కేటాయింపులో సుమారు 16 వేలకు పైగా సీట్లు మిగిలి పోయాయి. వీటిలో ఎక్కువగా విద్యార్థులు ఐటీ రిలేటెడ్ కోర్సులనే ఎంచుకున్నారు. మిగతా మెకానికల్, కెమికల్ , ఈసిఈ కోర్సులను పట్టించు కోలేదు. తాజాగా జెఎన్‌టియు నాలుగు కొత్త కోర్సులను బీటెక్ విభాగంలో ప్రవేశ పెట్టింది. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, రోబోట్రిక్స్ , బిజినెస్ అనలిటిక్స్ కోర్సులున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో కంప్యూటర్ సైన్స్ (సిఎస్ఈ) కోర్సులో 961 సీట్లు మిగిలి పోయాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో కేవలం 80 సీట్లు మాత్రమే మిగలడంతో ..మిగతా కోర్సులు ఎప్పటి లాగానే ఉన్నాయి. సగటున ఒక్కో విద్యార్థి 21 ఇంజనీరింగ్ కాలేజీలలో సిఎస్ఈ కోర్సులకు పోటీ పడినట్లు అధికారిక గణాంకలను పరిశీలిస్తే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల 628 మంది స్టూడెంట్స్ ఆప్షన్లు ఇవ్వగా అందులో 45 వేల 514 మంది అంటే 86.48 శాతం సిఎస్ఈ కోర్సుకు ఆప్షన్స్ ఇచ్చారు.
తర్వాత స్థానంలో ఈసీఈ కోర్సుకు 35 వేల 937 మంది పోటీ పడగా, ఈఈఈ కోర్సుకు 20 వేల 410 మంది, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుకు 16 వేల 608 మంది, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుకు 14 వేల 612 మంది ఆప్షన్లు ఇచ్చారు. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మా -డి కోర్సులలోను 3 వేల 698 సీట్లు మిగిలి పోవడం విశేషం. ఇదిలా వుండగా గ్రేటర్ పరిధిలోని ఎల్‌బి నగర్, ఇబ్రహీంపట్నం, ఘటకేసర్, కీసర, భువనగిరి, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్, గండిపేట్, మేడ్చల్ , తదితర ప్రాంతాల్లో సుమారు 150 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో అన్ని ఇంజనీరింగ్ విభాగాలు కలిపి దాదాపు 50 వేల సీట్ల దాకా వుంటాయి. ఎంసెట్ సీట్ అలాట్‌మెంట్‌లో దాదాపు అన్ని కాలేజీలు కలిపి 70 నుంచి 75 భర్తీ అయినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇండియన్ ఇన్‍స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లలో చేరేందుకు ఏటా డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. ఎంసెట్‍లో టాప్ ర్యాంకులు వచ్చిన వారు జేఈఈలో కూడా మంచి ర్యాంకులు రావడంతో సీటు దొరికిన వారందరూ దాదాపుగా ఐఐటీలో చేరారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి