చట్టం ముందు అంతా సమానం .. సభాపతిపై ధర్మాసనం ఆగ్రహం
ఈ దేశంలో ఎవరైనా సరే .. ఏ స్థాయిలో వున్నారనేది ముఖ్యం కాదు..ప్రతి ఒక్కరికి హక్కులు..బాధ్యతలు ఒకేలా ఉంటాయి. ప్రజాప్రతినిధులైనంత మాత్రాన వారికి ప్రత్యేక చట్టాలంటూ వుండవు. ఇది గుర్తించి నడుచు కోవాల్సిన బాధ్యత ఎన్నికైన వారికి వుండాలి. తెలియక పోతే తెలుసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. సభాపతి అయినంత మాత్రాన మేం చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదంటూ ..సర్వోన్నత న్యాయస్థానం కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, వారి అనర్హత పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అసలు స్పీకర్ మా గురించి ఏమనుకుంటున్నారు..? సర్వోన్నత న్యాయ స్థానం అధికారాలను స్పీకర్ సవాల్ చేస్తున్నారని అనుకోవాలా...ఇదేనా ఆయన ఉద్దేశం..? స‌్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసేందుకు సంబంధించి మాకున్న పవర్ ను మీరు సవాల్ చేయాలని చూస్తున్నారా అంటూ స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. వారి రాజీనామాల కంటే ముందే అనర్హతపై నిర్ణయం తీసుకుంటే స్పీకర్ చట్టబద్దంగా పని చేసినట్లు భావించాలా అని నిలదీసింది. దీనిపై స్పందించిన లాయర్ అవుననే సమాధానం ఇచ్చారు సింఘ్వి. కర్నాటక సంక్షోభంపై వాడి వేడిగా కోర్టు లో వాదనలు జరిగాయి. మంగళవారం దాకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మరో వైపు ..కర్నాటక ముఖ్యమంత్రిగా వున్న కుమార స్వామి ..మీడియా ముందుకు వచ్చారు. శాసనసభలో బల పరీక్షకు ఎప్పుడైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ సంక్షోభం చూసి తాను కలత చెందానని..శాశ్వతంగా అధికారంలో ఉండాలని భావించడం లేదన్నారు. తాను అన్నింటికి సిద్ధమై ఉన్నానని స్పష్టం చేశారు. శాససనభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బలం ఉన్నప్పుడే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది..ఎమ్మెల్యేల రాజీనామాలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. స్పీకర్ సర్, మీరు తగిన సమయాన్ని కేటాయించి, తేదీ నిర్ణయిస్తే బలం నిరూపించేందుకు సిద్ధపడతాను. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటానని కుమారస్వామి భావోద్వేగంతో తెలిపారు. కాగా ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడు కోరినా ఇచ్చేందుకు సిద్ధమని అటు వైపు స్పీకర్ నుంచి సమాధానం వచ్చింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే , విశ్వాస పరీక్షపై నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉమ్మడిగానే తీసుకున్నామని మాజీ సీఎం సిద్దరామయ్య వెల్లడించడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి