రేపటి క్రికెట్ జగజ్జేత ఎవరో - ప్రపంచం ఉత్కంఠ భరితం..!
అంచనాలు రేపి..ఆశలు పరుగులు తీసేలా చేసి..కోట్లాది గుండెల్లో గుబులు రేపి..మనసుల్ని నిదుర పోనీయకుండా చేసిన ప్రపంచ క్రికెట్ కప్‌ను ఎవరు సగర్వంగా ముద్దాడుతారో రేపటితో స్పష్టమవుతుంది. ఫైనల్‌కు అనూహ్యమైన రీతిలో దూసుకొచ్చిన న్యూజిలాండ్ ఒక వైపు..అంచనాలకు మించి ప్రొఫెషనల్ ఆటతీరును ప్రదర్శించడమే కాకుండా హాట్ ఫేవరేట్‌గా ఫ్యాన్స్ నుంచి నీరాజనాలు అందుకుంటున్న ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మరో వైపు కదన రంగంలోకి దూకేందుకు రెడీ అంటోంది. ఇరు జట్ల మధ్య హోరా హోరీగా పోటీ మాత్రం జరగనుందన్నది ఖాయం. ఒకటా రెండా ఏకంగా లక్షలను దాటి..ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది క్రికెట్ టోర్నీ అంటే నమ్మగలమా.
ఇది అక్షరాల వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు భారీ ఎత్తున బిడ్డింగ్ నిర్వహిస్తే ..దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరకు మీడియా రారాజుగా వెలుగొందుతున్న స్టార్ టీవీ గ్రూపు చేజిక్కించుకుంది. ఇది కూడా ఓ రికార్డు. ప్రపంచానికి టెన్నిస్, ఫుట్ బాల్ మాత్రమే తెలుసు ..మొన్నటి దాకా..కానీ ఇవాళ లోకాన్ని క్రికెట్ శాసిస్తోంది..ఊపేస్తోంది..గుండె లు అవిసి పోయేలా చేసేస్తోంది ఈ ఆట. 11 మంది పిచ్చి వాళ్లు చూస్తుంటే..లక్షల మంది పిచ్చోళ్ల..పని లేనోళ్లు చూస్తుంటారని..క్రికెట్ వ్యతిరేకులు చేసిన కామెంట్స్ తప్పని నిరూపించింది క్రికెట్. ఒకప్పుడు గిల్లీ దండా ఉండేది ఇండియాలో. ఇపుడు క్రికెట్ అంటేనే ఇండియా..ఈ దేశం 110 కోట్ల జనాభాను దాటేసింది ఎప్పుడో.
ఎన్నో కులాలు. లెక్కలేనన్ని మతాలు, ఈర్ష్యలు, ద్వేషాలు..మరెన్నో రాష్ట్రాలు..కానీ ఈ మొత్తం జాతినంతా ఒకే తాటిపైకి తీసుకు వచ్చి..ఒకే స్వరమై..పతాకమై...జాతీయ జెండా మీద సింధూరాన్ని అద్దింది మాత్రం క్రికెట్ ఒక్కటే..సరిహద్దులో ఉన్న సైనికులైనా..పసితనం కలబోసుకుని..ప్రపంచం అంటే ఏమిటో తెలియని చిన్నారులు సైతం క్రికెట్ అంటే పడిచస్తారు. ప్రాణం పోసుకుంటారు..ఇండియా సెమీఫైనల్లో ఓడి పోవడం చూసి ఓ భారతీయ గుండె ఆగిపోయిందంటే దీనికున్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల్లో నరనరాన క్రికెట్ ప్రవహిస్తోంది. ఇదంతా 1983లో హర్యానా కరేన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఎప్పుడైతే క్రికెట్ కప్‌ను తీసుకు వచ్చాడో ..ఇక అప్పటి నుంచి నేటి దాకా క్రికెట్ ఆట దేశాన్ని శాసిస్తోంది.
భారత దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ..గవర్నర్లు, సీఎంలు..అన్నీ పక్కన పెట్టేసి..భారత..కివీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్ చూస్తూ కూర్చున్నారంటే ఏమనుకోవాలి..క్రికెట్ కు ఉన్న బంధం అలాంటిది మరి..మనం ఓడి పోయామా..ప్రత్యర్థి జట్టు ప్రభావాన్ని తట్టుకోలేక చతికిల పడ్డామా పునరాలోచించు కోవాలి..టీమిండియా జట్టు కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు. ఇక టోర్నీ విషయానికి వస్తే, ఫైనల్ కు ఇంగ్లండ్ అన్ని వసతులను కల్పించింది. ఇప్పటి నుంచే ప్రపంచం అంతటా వీక్షించేలా..తమ దేశం గర్వించేలా తమ జట్టు ఆడాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు అక్కడి అభిమానులు..ఎందుకంటే ఇరు జట్లూ మొదటి సారిగా ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇదే ఈ టోర్నీలో ప్రత్యేకత.

అభిమానులు తట్టుకోలేక అంపైర్లను తిట్టుకుంటారు..కానీ వారికి తెలియదు ..కోట్లాది కళ్లన్నీ వారి మీద ఉంటాయని..ఎవరికీ వ్యక్తిగత కోపం..ద్వేషం అంటూ వుండదు. సెలక్షన్ ప్యానల్ ఎన్నో పరీక్షలు పెట్టి..వారిని ఎంపిక చేస్తుంది. తప్పులు చేసి తప్పుకోవాలని అనుకుంటారా..అలాంటిది ఉండదు. ఒక్కోసారి మనుషులన్నాక తప్పులు జరగడం సహజం. కివీస్ కెప్టెన్, రాయ్ లు ఇంగ్లండ్ అస్త్రాలను తట్టుకునేందుకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. మరో వైపు ఆతిథ్య జట్టు సైతం ఢీ కొట్టేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తోంది. ఇరువురిలో ఎవరో ఒకరికి స్వంతం కాబోతోంది ప్రపంచ కప్పు..అంతిమంగా కోట్లాది అభిమానుల గుండెల్లో గుబులు రేపే క్రికెట్ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి