పెరిగిన ఇళ్ల ధరలు..బతుకులు బుగ్గి పాలు..రియల్లీ రియల్ దందా..!

ఒకప్పుడు చేతిలో ఓ యాభయ్యో ..వంద రూపాయలు వుంటే చాలు ఈజీజీ బతికే వీలుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నీళ్లు , నిధులు , నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోంది. ఐటి హబ్ మాటేమిటో కానీ సామాన్యులు , మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితులు కనిపించడం లేదు . గత పాలకుల హయాంలో ఈ ప్రాంతం కబ్జాకు , దోపిడీకి తెరలేసింది. విలువైన భూములు చాలా అన్యాక్రాంతమైనవి. ఎక్కడ చూసినా రాళ్లు , రియల్ ఎస్టేట్ వెంచర్లు , అపార్ట్ మెంట్లు దర్శనమిస్తున్నాయి. ఇంకో వైపు ఆకాశాన్ని తాకేలా ఐటి కంపెనీలు కొలువు తీరాయి . కొలువుల సంగతి దేవుడెరుగు ఉన్న కొద్ది జాగా లేకుండా పోయింది .నగరాన్ని వ్యాపారులు , కంపెనీలు , కాలేజీలు , మాల్స్ , నగల దుకాణాలు , మొబైల్స్ స్టోర్స్ , రెస్టారెంట్స్, కార్ల షో రూమ్ లు , దుస్తుల దుకాణాలు వందల కొద్ది వెలిశాయి. ఇక నగరమంతా ఒక వైపు వుంటే పాతబస్తీ మాత్రం ఎప్పటి లాగానే ఉన్నది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. వేలాది మందికి నిలువ నీడ దొరకని పరిస్థితి. ఇక రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దేశం లో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ ...