అపజయంపై అంతర్మధనం - పార్టీకి చంద్రబాబు చికిత్స

దేశ రాజకీయాల్లో టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుకు యెనలేని పేరున్నది. ఆయనకు అపారమైన అనుభవం ఉన్నప్పటికీ, అపర చాణుక్యుడిగా వినుతికెక్కిన ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా అపజయం పాలు కావడంపై బాబు జీరించుకోలేక పోతున్నారు. ఏపీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా కొన్ని సీట్లకే పరిమితం కావడం, అతిరథ మహారథులు అనుకున్న సీనియర్లు, మాజీ మంత్రులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేలు జరిగేలా పథకాలను అమలు చేసారు. అధికారులను పరుగులు పెట్టించారు.

కానీ ఆశించిన రీతిలో తాను నమ్ముకున్న నాయకులు అందుకోలేక పోయారు. దీంతో చంద్ర బాబు ఒక్కడే ..ఒంటరిగా మిగిలారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఎంతో కష్టపడ్డారు. అంతే కాకుండా కొత్త రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకు వచ్చెనందుకు కృషి చేసారు. అయినా జనం టీడీపీ కంటే వైసీపీ నే ఎక్కువగా నమ్మారు. భారీ ఎత్తున ఆ పార్టీకి అంతులేని విజయాన్ని ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల తూటాలు పేల్చుతున్నారు. బాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్షిస్తున్నారు. కొన్నింటిపై విచారణకు ఆదేశించారు కూడా. ఏపీలో ఇలా వుంటే తెలంగాణాలో మరీ దారుణంగా ఉంది టీడీపీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల్లో జత కట్టడం కొంత మేరకు లభించినా భారీ ఎత్తున మూల్యం చెల్లించుకుంది. ఏ పార్టీకి లేనంత బలమైన కేడర్ ఉన్నది ఈ పార్టీకే.

కానీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయింది . తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడానికి ఎల్ .రమణ తో పాటు సీనియర్లు రావుల , తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ టీఆరెఎస్ గ్రామ స్థాయి నుంఢి పట్టణ స్థాయి దాకా బలోపేతం కావడం కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశం . పార్టీకి సంబంధించి చంద్రబాబు నేతృత్వంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సీనియర్లు , భాద్యులు పాల్గొన్నారు. ఓటమిపై సమీక్ష చేపట్టారు. ఎక్కడ పొరపాట్లు జరిగాయో చర్చకు వచ్చాయి.

ఈ సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్ను దన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజిక వర్గ ఓట్లు చెదిరి పోవడం కూడా మరో కారణమని పేర్కొన్నట్లు సమాచారం. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తెదేపా మద్దతిస్తుందని బ్యూరో స్పష్టం చేసింది. మొత్తం మీద ట్రబుల్ షూటర్ గా ఉన్న చంద్రబాబుకు ఈ ఓటమి వెనుక ఉన్న మర్మం ఏమిటో అంతు చూసేందుకు కంకణం కట్టుకున్నారు . మొత్తం మీద రాజకీయంగా ఎన్నో పరీక్షలను గట్టెక్కించేలా చేసిన అధినేతకు పార్టీ పరంగా అగ్ని పరీక్షను ఎదుర్కుంటున్నారు.

కామెంట్‌లు