కాషాయ కండువా కప్పుకున్న వివేక్
తెలంగాణాకు పెద్ద దిక్కుగా, పెద్దాయనగా పిలుచుకునే దివంగత నాయకుడు, బహుజనుల బాంధవుడు వెంకట స్వామి కుమారుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీ లో చేరారు . దేశ రాజధాని ఢిల్లీలో రాష్త్ర పార్టీ అధినేత లక్ష్మణ్ , కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి బీజీపీ దేశ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ , తదితర నాయకులు, అనుచరులు , అభిమానులు, కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు. ఈ దేశంలో ప్రస్తుతం బీజేపీ పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చేరిక సందర్బంగా వివేక్ చెప్పారు.
సున్నిత మనస్తత్వం కలిగిన వివేక్ ఇప్పుడు తెలంగాణలో పేరున్న నాయకుడు. ఆయనకు సమున్నత స్తానం కపించనున్నట్లు పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. తెలంగాణాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పుంజుకుంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీని నమోదు చేసుకుని, ఏకంగా ఏ పార్టీ మద్దతు లేకుండానే కేంద్రంలో పవర్ లోకి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా రెప రెప లాడేలా మోదీ, అమిత్ షాలు వర్కవుట్ చేస్తున్నారు. సౌత్ లో కర్ణాటకలో కమల దళం ఎద్దే ఆధ్వర్యంలో అధికారమలోకి వచ్చింది . ఇక వారి టార్గెట్ అటు ఏపీలోనూ , ఇటు తెలంగాణలోనూ పాగా వేయాలన్న దిశగా పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
తెలంగాణాలో బలమైన నాయకుడిగా ఉన్న కెసిఆర్ ను ఢీకొట్టాలంటే బీజేపీ మరింత బలం పంకజ కోవాల్సి ఉంది. ఇందు కోసం పార్టీ పరంగా గ్రామ స్థాయి నుండి దేశ స్తాయి దాకా కార్యకర్తలు, నాయకులకు వెన్ను దన్నుగా నిలవడం. కొత్త వారిని పార్టీలోకి చేర్చు కోవడం. అందులో భాగంగానే ఇవాళ అన్ని పార్టీలకు చెందిన వారికి ఆహ్వానం పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణాలో టీడీపీ కి బలం లేకుండా పోయింది . ఆ పార్టీ కేడర్ తో పాటు నేతలు వస్తే చేర్చు కోవాలని ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తినడం తో నాయకులు కమలం వైపు చూస్తున్నారు. ఇక గడ్డం వివేక్ చేరడం వల్ల ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు లభించ నుంది.
వివేక్ రాజకీయ నాయకుడే కాదు దేశంలో గుర్తింపు కలిగిన పారిశ్రామికవేత్త కూడా. విశాఖ ఇండస్ట్రీస్ కు చైర్మన్ గా ఉన్నారు . గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంఢి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో ఉంటూ ఉద్యమ నేతగా పని చేశారు. ఇందు కోసం పార్టీ నించు సస్పెండ్ అయ్యారు. అయినా ఆయన తన ధర్మాన్ని తప్పలేదు. కేసీఆర్ పిలుపుతో టీఆరెఎస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందని భావించారు. కేసీఆర్ దెబ్బ కొట్టారు. దీంతో పార్టీని వీడారు .

తెలంగాణాలో జరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేసారు. ఆయన చేతుల్లో పరిశ్రమలతో పాటు ఓ పత్రిక , మరో ఛానల్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు బీజీపీలో చేరడంతో ఆ పార్టీకి స్వంత వాయిస్ ను వినిపించేందుకు ఓ వేదిక ఏర్పడనుంది . తన తండ్రి పేరుతో ఫౌండేషన్ కూడా ఉంది. కులమతాలతో తేడా లేకుండా పేదలు , వారి పిల్లలకు ఆర్ధిక సాయం చేస్తే బావుంటుంది. కానీ వివేక్ లాంటి వాళ్ళు తరుచూ పార్టీలు మారడం వల్ల ప్రజల్లో తప్పుడు మెసేజ్ వెళుతుందన్నది గమనించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి