పెరిగిన ఇళ్ల ధరలు..బతుకులు బుగ్గి పాలు..రియల్లీ రియల్ దందా..!

ఒకప్పుడు చేతిలో ఓ యాభయ్యో ..వంద రూపాయలు వుంటే చాలు ఈజీజీ బతికే వీలుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. నీళ్లు , నిధులు , నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోంది. ఐటి హబ్ మాటేమిటో కానీ సామాన్యులు , మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితులు కనిపించడం లేదు . గత పాలకుల  హయాంలో ఈ ప్రాంతం కబ్జాకు , దోపిడీకి తెరలేసింది. విలువైన భూములు చాలా అన్యాక్రాంతమైనవి. ఎక్కడ చూసినా రాళ్లు , రియల్ ఎస్టేట్ వెంచర్లు  , అపార్ట్ మెంట్లు దర్శనమిస్తున్నాయి. ఇంకో వైపు ఆకాశాన్ని తాకేలా ఐటి కంపెనీలు కొలువు తీరాయి .

కొలువుల సంగతి దేవుడెరుగు ఉన్న కొద్ది జాగా లేకుండా పోయింది .నగరాన్ని వ్యాపారులు , కంపెనీలు , కాలేజీలు , మాల్స్ , నగల దుకాణాలు , మొబైల్స్ స్టోర్స్ , రెస్టారెంట్స్, కార్ల షో రూమ్ లు , దుస్తుల దుకాణాలు వందల కొద్ది వెలిశాయి. ఇక నగరమంతా ఒక వైపు వుంటే పాతబస్తీ మాత్రం ఎప్పటి లాగానే ఉన్నది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. వేలాది మందికి నిలువ నీడ దొరకని పరిస్థితి. ఇక రియల్ ఎస్టేట్ దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దేశం లో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ  ఉండేందుకు అవకాశాలతో పాటు వనరులు సమృద్ధిగా ఉండడంతో ఇతర రాష్ట్రాలు , ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్ కు వస్తున్నారు. దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో వ్యాపారులు , రియల్ ఎస్టేట్ మాయగాళ్లు తిమ్మిని బమ్మి చేస్తున్నారు.

అర చేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఏకంగా అపార్ట్ మెంట్ల ధరలు కోటిన్నరకు పైగా చేరుకున్నాయి . ఇదిలా ఉండగా ఇండియాలో అతి ఎక్కువగా ఇళ్ల ధరలు పెరిగిన నగరంగాహైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇళ్లు కొనే పరిస్థితి దాటి పోయింది. గత ఆరు నెలల్లోనే హైదరాబాద్‌‌లో ఇళ్ల రేట్లు 9 శాతం పెరిగిపోయాయి. ముంబై, పూణే, చెన్నై నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు 3 నుంచి 4 శాతం తగ్గగా… హైదరాబాద్‌‌లో మాత్రం 9 శాతం పెరిగాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట, నానక్ రామ్ గూడ లాంటి ప్రాంతాల్లో  ధరలు కొండెక్కాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌‌లో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు . మొత్తం మీద హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం సామాన్యుల , మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారిందన్నది వాస్తవం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!