ఇక సెలవన్న ఎమ్మెస్కే ప్రసాద్

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఇండియన్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ మన్నవ శ్రీకాంత ప్రసాద్ పదవీ కాలం ముగిసింది. సంక్షోభంలో ఉన్న భారతీయ క్రికెట్ కు ఓ రకంగా దిశా నిర్దేశం చేసేందుకు ప్రయత్నం చేశారు. తెలుగు వాడైన ఎమ్మెస్కె సక్సెస్ ఫుల్ గా తన పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2016లో ఆయన భారత క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రసాద్ స్వంత స్థలం గుంటూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడికొండూరు గ్రామం. నాన్న రవిప్రసాద్ గుంటూరులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లేబొరేటరీలో పని చేసే వారు. ఆయనకు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. వీళ్ళ ఊళ్లో ప్రతీ మూడిళ్లలో ఒక డాక్టరో, ఇంజనీరో ఉండే వారు. అలానే ఇతడి సోదరుడు కూడా ఇంజనీర్ కాగా, సోదరి డాక్టర్. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు లోని కేంద్రీయ విద్యాలయలో పూర్తయింది. గ్రాడ్యుయేషన్ హిందూ కళాశాలలో పూర్తి చేశాడు. పాఠశాల దశలోనే క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించడంతో గుంటూరుకు వచ్చి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గంటల తరబడి ప్రాక్టీసు చేసేవాడు. వికెట్ కీపింగ్ ఇతడికి సహజ సిద్ధంగానే అబ్బింది. గుంటూరులో జరిగిన కోచింగ...