పీఠం ఉండేనా..దాదా కొనసాగేనా
ఆటలోనే కాదు అన్నిటా తానై వ్యవహరిస్తున్న బెంగాల్ టైగర్, ప్రస్తుత బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ ఇంకో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. మరో తొమ్మిది నెలల్లోనే ప్రెసిడెంట్ కుర్చీ నుంచి సౌరవ్ గంగూలీ దిగిపోవాలని శాసిస్తున్న కూలింగ్‌ఆఫ్ పిరియడ్ నిబంధనను మార్చేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ రూల్‌ను సవరించాలని తమ తొలి జనరల్ బాడీ మీటింగ్‌లోనే దాదా నేతృత్వంలోని బోర్డు కొత్త కార్యవర్గం డిసైడైంది. అందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే, ఇండియా క్రికెట్‌కు సేవ చేసేందుకు ముందు కొస్తున్న సమర్థుల కాళ్లకు అడ్డు పడుతున్న కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ రూల్‌ను కూడా ఎత్తి వేయాలని, బోర్డు రాజ్యాంగానికి ఎలాంటి సవరణ చేయాలన్నా సుప్రీం అనుమతి అవసరం లేదని, దాన్ని ఏజీఎమ్‌కే కట్టబెట్టాలని నిర్ణయించింది.
వీటికి కూడా ఆమోదం తెలపాలని సుప్రీంను కోరనుంది. సుప్రీం ఓకే చెబితే గనుక దాదా 2024 వరకూ ప్రెసిడెంట్‌గా కొనసాగడంతో పాటు పాలనలో సమూల మార్పులు రానున్నాయి. పాలనలో తన దైన శైలిలో దూసుకెళ్తున్న సౌరవ్ గంగూలీ మరో కీలక అడుగు వేశాడు. బోర్డు పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే ఇండియాతో డే నైట్ టెస్టు ఆడించి.. మ్యాచ్‌ను అత్యద్భుతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్న దాదా.. ఇప్పుడు తన ‘మార్కు’పాలనకు అడ్డుగా ఉన్న లోధా సిఫారసులను మార్చేందుకు రెడీ అయ్యాడు. ప్రెసిడెంట్ కుర్చీలో తాను పూర్తికాలం అంటే మరిన్ని సంస్కరణలు చేపట్ట వచ్చని గంగూలీ డిసైడ్ అయ్యాడు.
బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో ఆరేళ్లు పని చేసిన ఆఫీస్ బేరర్లు కచ్చితంగా మూడేళ్ల విరామం తీసుకోవాల్సిందే అన్న లోధా కమిటీ సిఫారసును ఎత్తి వేయాలని దాదా అధ్యక్షతన జరిగిన బోర్డు తొలి జనరల్ మీటింగ్ నిర్ణయించింది. దీనికి ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టును కోరింది. కోర్టు దిక్కరణ చర్యలకు గురి కాకుండా ఉండేందుకు, బీసీసీఐ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ముందు ధర్మాసనం అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం వచ్చే ఏడాది పదవి నుంచి తప్పు కోవాల్సి ఉన్న దాదా, జరిగే విచారణలో ఈ సవరణకు సుప్రీం కనుక ఓకే చెబితే 2024 వరకూ బీసీసీఐ బాస్ గా కొనసాగుతారు.
అతనితో పాటు జై షా కూడా పూర్తి కాలం పదవిలో ఉంటాడు. బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో రెండు టర్మ్‌లు వేర్వేరుగా పని చేసిన వ్యక్తులకే కూలింగ్ షరతు వర్తించాలని దాదా నేతృత్వంలోని బోర్డు భావిస్తోంది. ఇక, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మీటింగ్‌కు హాజయ్యే బీసీసీఐ ప్రతినిధిగా సెక్రెటరీ జై షాను ఎంపిక చేస్తూ ఏజీఎం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. గతంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చింది. సెప్టెంబర్ వరకూ బీసీసీఐని నడిపించిన సీవోఏ ఆదేశం మేరకు ఈ మీటింగ్స్‌కు సీఈఓ జోహ్రీ హాజరయ్యారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే దూకుడు పెంచిన ఈ స్టార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు తీసుకు వస్తోడో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి