హెడ్గే సెన్సేషన్ కామెంట్స్
మెజారిటీ లేక పోయినా మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజుల పాటు హై డ్రామా నడపడంపై బీజేపీ సీనియర్ నేత, కర్నాటక ఎంపీ అనంత కుమార్ హెడ్గే సంచలన కామెంట్స్ చేశారు. 40 వేల కోట్ల కేంద్ర నిధులు వృథా కాకుండా కాపాడేందుకే ఫడ్నవిస్‌ను సీఎంను చేశారని ఆరోపించారు. ఒకవేళ చివరి నిమిషంలో ఫడ్నవిస్ రంగంలోకి దిగ కుండా ఉండి వుంటే ఆ నిధులను శివసేన కూటమి దుర్వినియోగం చేసేదేనని హెడ్గే ధ్వజమెత్తారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన మరి కొద్ది గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనగా, ఎన్సీపీ అసమ్మతి నేత అజిత్ పవార్ అండతో హడా విడిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం 15 గంటల్లోనే ఫడ్నవిస్ కేంద్ర నిధులను వెనక్కి తరలించినట్టు హెడ్గే విమర్శించారు. దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర సీఎంగా 80 గంటలు కొనసాగిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఈ డ్రామా అంతా ఆయన ఎందుకు నడిపినట్టు. మెజారిటీ లేక పోయినా ఆయన సీఎం అయ్యారని మీకు తెలియదా అని అందరూ అడుగుతున్నారు. దాదాపు 40 వేల కోట్ల కేంద్ర నిధులను ఫడ్నవిస్ కాపాడారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి పేరుతో వాటిని దుర్వినియోగం చేస్తారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఓ డ్రామా నడపాలని భావించారు.
అందుకే ముఖ్యమంత్రిగా వచ్చి15 గంటల్లోనే వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు అంటూ మండి పడ్డారు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం నడిపిన హైడ్రామాతో ఉడికి పోతున్న కూటమి పార్టీలు, తాజాగా హెడ్గే చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తి కరంగా మారింది. కేవలం సంకీర్ణ సర్కారును ఇరుకున బెట్టేందుకే రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా కమలనాథులు వ్యవహరించారంటూ ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. మొత్తం మీద మరాఠా రాజకీయాలు మరింత హీటు పుట్టిస్తున్నాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి