తట్టు కోలేనంత..ఛార్జీల మోత

నిన్నటి దాకా అపరిమిత నెట్ వర్క్, డేటా సౌకర్యంతో కస్టమర్స్ కు అంతులేని సంతోషాన్ని మిగిల్చిన మొబైల్ టెలికాం కంపెనీలు ఇప్పుడు ఛార్జీల మోత మోగించి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. నిన్నటి దాకా బంపర్ ఆఫర్లతో కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు శఠగోపం పెట్టిన ఈ కంపెనీలు ఇప్పుడు ట్రాయ్ కొట్టిన దెబ్బకు నష్టాలు పూడ్చుకునేందుకు వడ్డన మార్గం ఎంచుకున్నాయి. ఇక కొద్ది గంటలు మాత్రమే ఉండడంతో ఇక ఉచితం అంటూ ఏదీ ఉండబోదని స్పష్టమైంది. ఇప్పటికే ఎంత పెంచాలనే దానిపై టెలికాం కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. మరో వైపు దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ టెలికాం కంపెనీ దివాళా అంచున నిలబడింది.

దీనిని గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతోంది మోడీ ప్రభుత్వం. ప్రైవేట్ టెలికాం సెక్టార్ లో రిలయన్స్, ఎయిర్ టెల్ , వోడా ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి, ఛార్జీల భారం మోపేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వొడాఫోన్ ఐడియా తన మొబైల్ కాల్స్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2 రోజుల, 28 రోజుల, 84 రోజుల, 365 రోజుల వాలిడిటీతో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌‌‌‌ పెయిడ్‌‌‌‌ సర్వీసుల కొత్త ప్లాన్స్‌‌‌‌ను కూడా వెల్లడించింది. కొత్త ప్లాన్స్, పాత ప్లాన్ల రేట్ల కంటే 42 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కూడా తన కాల్, డేటా ఛార్జీలను రివైజ్ చేయనుంది. తాను కూడా ప్రీపెయిడ్ కస్టమర్ల డేటా, కాల్ ఛార్జీలను పెంచనున్నట్టు ప్రకటించింది.

ఈ కంపెనీ కొత్త ప్లాన్స్ కాస్ట్ కూడా అన్‌‌‌‌లిమిటెడ్ కేటగిరీలో పాత ప్లాన్స్ కంటే 42 శాతం వరకు అధికంగా ఉన్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కొత్త ప్లాన్ల టారిఫ్‌‌‌‌లు రోజుకు 50 పైసల నుంచి 2.85 మధ్యలో పెరిగాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ థ్యాంక్స్ ప్లాట్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో భాగంగా ఎక్స్‌‌‌‌క్లూజివ్ ప్రయోజనాలను అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇక ఈ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో కూడా రెడీ అవుతోంది. అన్‌‌లిమిటెడ్‌‌ వాయిస్, డేటాతో కొత్త ఆల్‌‌–ఇన్‌‌–వన్‌‌ ప్లాన్స్‌‌ను లాంచ్ చేస్తున్నది. దీనిలో భాగంగా తన వాయిస్, డేటా ఛార్జీలు 40 శాతం వరకు పెరగనున్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాన్స్ కింద 300 శాతం వరకు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. మొత్తం మీద మోత మోగడం ఖాయమన్న మాట.

కామెంట్‌లు