నీతులు సరే ఆస్తుల మాటేమిటి..?

తెలంగాణాలో అవినీతి ఆక్టోపస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం ఆయా శాఖల్లో పని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు పెద్దఎత్తున వేతనాలు పెంచినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. రెవెన్యూ శాఖలో ఈ జాడ్యం మరింత పెరిగింది. పలు చోట్ల అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. కళ్ళు బైర్లు కమ్మేలా నోట్లకట్టలు, ఆభరణాలు, ఇల్లు, ఫ్లాట్స్, ప్లాట్లు కు సంబంధించి డాక్యుమెంట్స్ లెక్కకుమించి దొరికాయి. తాజాగా కేశంపేట మండల తహశీల్దార్ లావణ్య అరెస్ట్ మరిచిపోక ముందే చిలుక పలుకులు పలుకుతూ నీతి సూత్రాలు వల్లెవేసిన తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి అడ్డంగా ఏసీబీకి దొరికి పోయారు. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పలు చోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్ తో పాటు ఆయన బంధువులు ఉంటున్న ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టారు. దిలీశుఖ్ నగర్ లో ఆయన ఉంటున్న వైష్ణవి అపార్ట్ మెంట్ లో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పది చోట్ల దాడులు చేశారు. నగరంలోని ఏడు చోట్ల , మహబూబ్ నగర్ జి...