రాహులా మజాకా..!

ఒకప్పుడు తెలంగాణ అంటేనే చీదరింపు. భాషతో..యాసతో ..వెటకారపు పలకరింపులు..ఇవ్వన్నీ తెలుగు సినిమాలో కనిపించేటివి.. వినిపించేటివి కూడా. అంతెందుకు ప్రచురణ, మీడియా లో వారిదే పెత్తనం. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఇగ అప్పటి నుంచి ఇక్కడి సంస్కృతికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ మాటలే. పాటలే..అలసి పోయేదాకా ఆడడమే. ఇటీవల మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరూ అంటే ఒకే ఒక్క పేరు ..అదే రాహుల్ సిప్లిగంజ్. స్టార్ మా టీవీ తో మనోడు మరింత ఫెమస్ అయిపోయిండు. ఇప్పటికే సింగర్ గా యూట్యూబ్ స్టార్ గా రికార్డ్ లు క్రియేట్ చేసింది. అంతే కాకుండా సినిమా లో ఎంటరయ్యిండు. అక్కడ కూడా తన వాయిస్ తో దుమ్ము రేపిండు. తాజాగా అతడి స్టామినా చూసి మా టీవీ బిగ్ బాస్ ప్రోగ్రాంలో రాహుల్ కు ఛాన్స్ ఇచ్చింది.

ఇంకేం జనాలకు మరింత కనెక్ట్ అయ్యిండు. పాటలు పాడుతూ, తన తెలంగాణ మాటలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలిమినేషన్ వరకు వచ్చేసరికల్లా ఫ్యాన్స్ అతడికి మరో ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రాం లో పార్టిసిపెంట్స్ తో పాటు రాహుల్ పోటీ పడుతూనే అన్ని టాస్క్ స్ ను ఎదుర్కుంటూ పోటీకి సై అంటున్నాడు. హైదరాబాద్ లోని ధూల్ పేట లో ఆగస్టు 22, 1989 రాహుల్ సిప్లిగంజ్ పుట్టాడు. జానపద గాయకుడిగా మొదట పేరు తెచ్చుకున్నాడు. ఆయన పాడిన పాటలు జనాన్ని, యూత్ ను బాగా ఇంప్రెస్స్ చేశాయి. చరణ్ నటించిన సుకుమార్ తీసిన రంగస్థలం మూవీలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన రంగస్థలాన..మేమంతా ఆటబొమ్మలం అనే సాంగ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దీంతో రాహుల్ కు ఎదురే లేకుండా పోయింది. గాయకుడిగా, పాటల రచయితగా రాహుల్ కు మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందాడు. 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. చిన్నపప్నటి నుండి పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసాడు. వంట గదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడడం గమనించిన రాహుల్ తండ్రి, పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు. సొంతంగా పాటల వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో పెట్టేవాడు. వాటికి మంచి స్పందన వచ్చింది.

హేయ్ పిల్లా, ఎందుకో, ఏం మాయలో, మంగమ్మ , మైసమ్మ , ఏనది, మాక్కికిరికిరీ, పూర్ బాయ్, మగజాతి, పోయినవా, దావత్ , గల్లీ కా గణేష్ , జై బోలో ఎల్లమ్మ తల్లికి పేరుతో తీసిన వీడియో ఆల్బమ్స్ కు హెవీ రెస్పాన్స్ వచ్చింది. రాహుల్ 20 సంవత్సరాల వయసులో తొలిసారిగా సినిమాలో పాడాడు. ఆ తరువాత దమ్ము వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో గుర్తింపు పొందాడు. 2018 లో వచ్చిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని ఏ మెలికెల్ పాటలో స్పానిష్ భాగాన్ని పాడాడు. వీటితో పాటు ఈగ, రచ్చ, సుడిగాడు, లై, గ్యాంగ్ , చల్‌ మోహన రంగా , ఆర్‌ఎక్స్‌ 100 , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, మల్లేశం, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో తాను పాటలు పాడాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో ఫైనల్ పోటీదారుడిగా ఉన్నారు. మొత్తం మీద ఈ తెలంగాణ పోరడు తన టాలెంట్ తో యూట్యూబ్ లోను ..ఇటు సినిమాల్లో, బుల్లితెర మీద తానేమిటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. రాహుల్ మరింత ఎదగాలనికోరుకుందాం.

కామెంట్‌లు