బాంటియా..దాండియా..!

ఆర్ధిక మందగమనం దెబ్బకు బడా కంపెనీలన్నీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. జనంలో కొనుగోలు శక్తి లేకపోవడంతో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ కంపెనీలన్నీ ఆఫ్ లైన్ తూ పాటు ఆన్ లైన్ ను నమ్ముకున్నాయి. అయినా కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో బంగారాన్ని కొనేందుకు, దాచి పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రూటు మార్చిన కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. రా రామ్మంటూ తాయిలాలు ఎరగా వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించండి కావాల్సినవన్నీ, కోరుకున్నవన్నీ మీ ఇంటికి తీసుకు వెళ్లండంటూ వేడుకుంటున్నాయి. తాజాగా ఫర్నిచర్ సెక్టార్ లో టాప్ రేంజ్ లో ఉన్న బాంటియా విస్తుపోయేలా బహుమతులు ప్రకటించింది.

దేశంలోనే అతిపెద్ద రిటైలర్‌ అవార్డు సొంతం చేసుకున్న సదరు కంపెనీ ఈ సారి మస్తు జోష్ నింపేందుకు రెడీ అయ్యింది. బాంటియా ఫర్నిచర్‌ ప్రతి ఏటా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.   సాధారణంగా ఎవరైనా ఫ్లాట్‌ లేదా ప్లాట్‌ కొంటే నజరానాలు ప్రకటిస్తారు. అయితే బాంటియా ఫర్నిచర్‌ షోరూం తమ కస్టమర్లకు పైవన్నీ ఉచితం అని ప్రకటింది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆల్టో కారు, యాక్టివా స్కీములకు తో డుగా ఈ కొత్త ఆఫర్‌ను ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇండియాలో ఎక్కడైనా తమ బ్రాంచీలలో లేదా తెలంగణా, ఏపీలలో ఉన్న బాంటియా షోరూంలలో 4.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్,  3.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి 100 గజాల ప్లాటు అందజేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

 యాదగిరి గుట్ట సమీపంలోని దత్తాయిపల్లి గ్రామ పరిధిలో డీటీసీపీ అప్రూవ్డ్‌ లే–అవుట్‌లో నిర్ణీత రిజిస్ట్రేషన్, డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించిన వారికి ఫర్నిచర్‌తో పాటే ఆయా ఫ్లాట్‌, ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తారు. ఇక 2.99 లక్షల ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తే బీఎస్‌–6, 2019 మోడల్‌ ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ కారు, 99 వేల ఫర్నిచర్‌ కొనుగోలుపై హోండా యాక్టివా లేదా వెస్పాను ఉచితంగా పొందవచ్చు. ఎంపిక చేసిన రిక్లైనర్‌ సోఫా సెట్‌తో పాటు 55 ఇంచుల ఎల్‌ఈడీ టీవీని సైతం ఉచితంగా అందజేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి నిర్ణీత మొత్తానికి ఎంఆర్‌పీ ధరల్లో ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి ఆయా ఆఫర్లు వర్తింప చేయనున్నారు.

కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి, మిగతా మొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లించే వెసులు బాటు కల్పిస్తున్నారు. మారుతున్న వినియోగదారులకు అభిరుచులు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ఉత్పత్తులు, విక్రయాల్లో మార్పులు తెస్తూ ఉండటం వల్లే తాము ప్రస్తుతం ఫర్నిచర్‌ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే అన్ని రకాల ఫర్నిచర్‌ ఉత్పత్తులను సరసమైన ధరల్లో తమ షాపుల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. లెథర్, ఫ్యాబ్రిక్, రిక్లయినర్, లౌంగర్, స్లీక్, కార్వ్‌డ్‌ తదితర మోడళ్లలో ఉత్తమ క్వాలిటీతో తమ వద్ద  10 వేల నుంచి  5.౫ లక్షల విలువ చేసే సోఫాలు అందుబాటులో ఉంచింది. మొత్తం మీద బాంటియా తనకు ఎదురే లేదని దూసుకు వెళుతోంది. 

కామెంట్‌లు