పసిడి ధరతో పరేషాన్

కొనుగోలుదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది బంగారం. మార్కెట్ లో బంగారం ధరలు అమాంతం పెరుతున్నాయే తప్పా తగ్గడం లేదు. ధరాభారం మోయలేకున్నా జనం మాత్రం కొనుగోలు చేయడం మాత్రం మానడం లేదు. ఇటీవల కాస్త నెమ్మదించిన పసిడి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, దేశీయంగా కొనుగోళ్లు వెల్లు వెత్తడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ 39 వేల రూపాయల స్థాయికి చేరింది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహ పరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య అంతరం పెరగడం కూడా మరో కారణం. దీంతో ఫ్యూచర్ మార్కెట్లో కూడా ధరలు మళ్లీ పైపైకి పోతున్నాయి. వరల్డ్ మార్కెట్లో పసిడి ధరలు 7 వారాల గరిష్టాన్ని నమోదు చేసాయి. దేశీయంగా ఇదే ధోరణి నెలకొంది. దేశ రాజధానిలో మంగళవారం 191 పెరిగి 10 గ్రాముల ధర 39,239 పలికింది. అటు వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. ఒక్క రోజే 943 పెరగడంతో కేజీ వెండి ధర 47,146కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 6 డాలర్లు పెరిగి 1,495 స్థాయికి చేరింది. పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. అమెరికా ఎగుమతులు క్షీణించడంతో నాలుగో త్రైమాసికంలో వృద్ధిపై అనుమానాలు ర...