మనోడు..అపర కుబేరుడు
ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీకి బాగా కలిసొచ్చింది. మిగతా కంపెనీలకు షాక్ ఇస్తూ..తన వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో ఆయన అందరికంటే ముందు వరుసలో నిలిచారు. ఇది కూడా ఇండియన్ బిజినెస్ లో ఓ చరిత్రే. ముకేశ్ సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర అంటే దాదాపు 1.2 లక్షల కోట్లు పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ వాస్తవ విషయాలు వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్ డాలర్ల నికర విలువతో దాదాపు 4.3 లక్షల కోట్లు గా పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. వ్యాపార పరంగా కొన్ని సార్లు హెచ్చు తగ్గులకు లోనైనప్పటికీ గణనీయమైన ఆదాయాన్ని గడించింది.
రిలయన్స్ గ్రూప్ కంపెనీలో షేర్స్ తీసుకున్న వారికి పెద్ద ఎత్తున ప్రాఫిట్ లభించింది. ఇదిలా ఉండగా గహంలో 10 రూపాయలతో ఒక్క షేర్ విలువ ఉండగా ఇప్పుడు అది ఏకంగా 10 వేల రూపాయలకు చేరింది. గతంలో కంటే ఈ సంవత్సరం మదుపుదారులకు భారీగా లాభాలు అందేలా కంపెనీ ప్రయత్నం చేసింది. ఊహించని రీతిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లడం కూడా ముకేశ్ అంబానీ సంపద పెరిగేందుకు కారణమైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ గణాంకాల ప్రకారం, గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ వ్యాపార విభాగాల్లోకి శర వేగంగా విస్తరిస్తోంది. జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. తాజాగా జియో గిగాఫైబర్ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ దూసుకెళుతోంది.
ఇక రిటైల్ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ కామర్స్ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇదే సెక్టార్ లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద మరో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద ముకేశ్ ఈ రూపకంగా చరిత్ర సృష్టించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి