ప్రిన్స్ సందేశం..వీకెండ్ వ్యవసాయం

వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..గులాబీ బాస్ కేసీఆర్. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణలో నీళ్లు పారించేందుకు..ప్రతి పల్లెలో వ్యవసాయం చేసేందుకు మార్గం సుగమం చేశారు. రాబోయే 2020 సంవత్సరానికల్లా తెలంగాణ అంతటా 60 శాతానికి పైగా పొలాలు పచ్చగా మారనున్నాయి. ఆ దిశగా ఇప్పటికే జనంలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ప్రస్తుత సర్కార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాలలో తీవ్రంగా ..అపారంగా నష్టపోయింది. వివక్షకు గురైంది. ఆత్మహత్యలు, ఆకలి చావులు, మోసానికి లోనైంది. ప్రతి రైతుకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు పొలాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎన్ ఆర్ ఐలు , సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఇతర శాఖల్లోని, సంస్థల్లోని ఉద్యోగులు భారీ ఎత్తున పొలాలు తీసేసుకున్నారు. అక్కడి నుంచే ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల పండ్ల తోటలు, పురుగు మందులు లేని వ్యవసాయాన్ని, సాగును ప్రారంభించారు. రాబోయే కాలానికి ప్రస్తు...