స్వచ్ఛంధ సంస్థలకు షోకాజ్ నోటీసులు - సేవ పేరుతో స్వాహా
ఈజీగా మనీ సంపాదించాలంటే ..చోరీ అయినా చేయాలి లేదంటే బ్యాంక్‌కు రుణం పేరుతో కన్నం వేయాలి. ఇవేవీ చేత కాకపోతే..స్వచ్ఛంధ సంస్థ స్టార్ట్ చేస్తే చాలు. సులభంగా డబ్బులు పోగేసుకోవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఎన్‌జిఓలు, ఫౌండేషన్లు పుట్టుకు వచ్చాయి. కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు సైతం ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ పేరుతో ప్రారంభించడం..ఆదాయ పన్ను మినహాయింపు పొందడం పరిపాటిగా మారింది. దీనిని గమనించిన మోదీ సర్కార్ అసలు ఎన్ని ఎన్‌జిఓలు దేశంలో ఉన్నాయో హోం శాఖకు పురమాయించారో. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏయే కార్యక్రమాలు చేపట్టాయి. అందులో వాస్తవం ఎంత. ఎన్ని కంపెనీలు, ఎన్‌జీఓలు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమైనా పని చేస్తున్నాయా తెలుసుకోమని ఆదేశించారు.
దెబ్బకు స్వచ్ఛంధ సంస్థల నిర్వాహకులు టాక్స్ రిట్నర్స్ సమర్పించలేక మూసుకుంటే ..మరికొన్ని తమ సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వమంటూ కోరాయి. తక్కువ ఖర్చుతో కార్యక్రమాలు చేపట్టడం. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో ప్రచురించడం. పబ్లిసిటీ చేసుకోవడం..డబ్బులు వసూలు చేయడం..లెక్కలు చూపించక పోవడం జరుగుతోంది. 100 శాతం ఎన్‌జీఓల్లో 10 శాతం మాత్రమే ప్రజలకు, సమాజానికి సేవ చేస్తున్నాయి. మిగతా స్వచ్ఛంధ సంస్థలు స్వాహా సంస్థలుగా మారాయి. వీటికి పొలిటికల్ లీడర్లు, బడా బాబులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరు ఎన్ జిఓ లను ప్రారంభించారు. ఐటీలో ఎంతో పేరున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. అంతేకాక దేశ వ్యాప్తంగా ఉన్న తమ పరిశీలనలోకి వచ్చిన 1755 స్వచ్ఛంధ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఈ సంస్థలన్నీ ఇప్పటి దాకా ఐటీ రిటర్న్ లు సమర్పించలేదు. దీంతో సీరియస్ గా తీసుకున్న కేంద్ర సర్కార్ కొరడా ఝులిపించింది. విదేశాల నుంచి భారీ ఎత్తున విరాళాలు , నిధులు ఎన్‌జీఓలకు అందుతున్నాయి. వీటికి సరైన లెక్కలు చూపించడం లేదు. ఎఫ్‌సిఆర్ ఏ చట్టం కింద వీటికి నోటీసులు కూడా జారీ చేశారు. ఆదాయ , ఖర్చు వివరాలను పూర్తిగా సమర్పించక పోవడం వల్లనే ఈ చర్యలకు ఆదేశించాల్సి వచ్చిందని హోం శాఖ పేర్కొంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో పాటు ముంబయిలోని శ్రీ సిద్ధివినాయక గణపతి టెంపుల్ ట్రస్ట్, విజయవాడలోని లయోలా కాలేజ్ సొసైటీ, గురు హరిక్రిష్ణ ఎడ్యూకేషన్ సొసైటీ, ఛంఢీగడ్, అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్స్ , ఇతర సంస్థలపై కొరఢా ఝులిపించింది.
ఇక వీటితో పాటు నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్, వివేకానంద సేవా సదన్, బాంబే మెమూన్స్ ఎడ్యూకేషన్ సొసైటీ, రాజీవ్ గాంధీ సోషల్ సర్వీస్ సెంటర్, జవహర్ సర్వోదయ వికాస సమితి, ఇందిరా మహిళా భిక్ష్ సమితి, నెహ్రూ యువ సంకల్ప్ సంస్థాన్, జైన్ విశ్వ భారతి ఇనిస్టిట్యూట్, యంగ్ మెన్స్ క్రిష్టియన్ అసోసియేషన్, మిదాస్ ట్రస్ట్, మెవాట్ ఎడ్యూకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ, నార్త్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, గుహవతి అండ్ జామియా ఇస్లామియా అశ్రఫ్ ఉలూం అరబిక్ ఎడ్యూకేషన్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు వందలాది స్వచ్ఛంధ సంస్థలు సేవల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి