కేసీఆర్ ప్రయత్నం - స్టాలిన్ కరచాలనం - రాజకీయం రసకందాయం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ..గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. అపారమైన రాజకీయ అనుభవం కలిగిన ఈ పొలిటికల్ చాణుక్యుడు..అయిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా పావులు కదువుతున్నారు. గతంలో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. మమతాను కలిశారు. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కుమారస్వామితో మాట్లాడుతూనే ఉన్నారు. అఖిలేష్ యాదవ్‌తో కేటీఆర్‌కు సన్నిహిత సంబఃధాలున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి సింగిల్ డిజిట్ మెజారిటీ రాదని తేలిపోయింది. ఈ విషయాన్ని దేశంలోని ప్రధాన సర్వే సంస్థలతో పాటు ప్రచురణ, ప్రసార రంగాలు గగ్గోలు పెడుతున్నాయి. నిన్నటి దాకా కాలర్ ఎగరేసిన బీజేపీ అధినేత మోదీ..షాలు ఇపుడు శత్రువు అయినా సరే తాము స్వాగతం పలుకుతామని, రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పకనే చెప్పారు.
ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరో వైపు చంద్రబాబు బిజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు రావాలని కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇదిలా వుండగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కేరళ సీఎంను కలిశారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. తాజాగా డిఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాట బలమైన ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా డిఎంకేకు పేరుంది. మమతా బెనర్జీని కలిశారు. ఓ వైపు బీజేపీతో సఖ్యతతో ఉంటూనే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి మెజారిటీ రాదని నిఘా వర్గాలు తేటతెల్లం చేయడంతో ..సారు తన ఆలోచనలకు రెక్కలు తొడిగారు. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ కొలువు తీరనుందో తెలియక జనం ఉత్కంఠకు లోనవుతున్నారు. ఎలాగూ మోదీకి సపోర్ట్‌గా ఉన్నారు.
ఒకవేళ జరగరానిది జరిగితే ..కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే..దానికి బయటి నుంచి మద్ధతు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక డిఎంకే మొదటి నుంచి రాహుల్ గాంధీకి పూర్తి మద్ధతు ప్రకటించారు. ఆయన చంద్రబాబు నాయుడుతో మరింత సఖ్యతగా ఉన్నారు. జాతీయ రాజకీయాలు, మారుతున్న సమీకరణల గురించి గంటర్నరకు పైగా చర్చించారు. కేసీఆర్ తీసుకున్న ఫెడరల్ ఫ్రంట్ ను స్వాగతిస్తున్నామని..కానీ తమ స్టాండ్ మార్చుకోమని చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేంద్రంలో పెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. నిన్న విజయన్‌ను కలిస్తే..నేడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. రేపు కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు దేవగౌడను కూడా కలవనున్నారు. మొత్తం మీద ఇద్దరు చంద్రుల ప్రయత్నాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయనేది వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి