అబ్బా ..రిలయన్స్ దెబ్బ ..చిరు వ్యాపారులకు షాక్
భారతీయ వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదైనా వుందంటే అది రిలయన్స్ ఒక్కటే. ధీరూ భాయి అంబానీ ఏ ముహూర్తంలో రిలయన్స్ ను ప్రారంభించాడో కానీ ఇవాళ ఇండియన్ మార్కెట్ రంగాన్ని చేజిక్కించు కోవడమే కాక..ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తూ షేక్ చేస్తోంది ఈ కంపెనీ. ఆయిల్, టెలికాం, రిటైల్, లాజిస్టిక్, డిజిటల్, టాయిస్, ఎంటర్ టైన్‌మెంట్, మీడియా, ప్రింట్, సోషల్ మీడియా..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఒక్క టెలికాం రంగంలో గుత్తాధిపత్యం కలిగిన సంస్థగా ప్రభుత్వ ఆధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉండగా..ప్రపంచీకరణ పుణ్యమా అంటూ ..ప్రైవేట్ రంగ సంస్థలు ఈ రంగంలోకి వచ్చాయి. ఎప్పుడైతే ఎఫ్‌డీఐల వెల్లువ పెరగడంతో భారతీయ మార్కెట్‌ను బడా, దిగ్గజ కంపెనీలు వెల్లువలా ముంచెత్తాయి. ఒక్కో కంపెనీది ఒక్కో స్టయిల్. ఒక్కో స్ట్రాటజీ. బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్, యునినార్, ఐడియా, తదితర కంపెనీలు టెలికాం రంగాన్ని శాసించాయి.
ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందడం, టెక్నాలజీ డెవలప్ కావడం ఇవన్నీ మరింత పరిపుష్టం చేశాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. దీనిని గమనించిన అంబానీ అనూహ్యంగా టెలికాం రంగంపై దృష్టి పెట్టారు. ప్రతి సామాన్యుడు..భారతీయుడి చేతిలో తమ కంపెనీకి చెందిన ఫోన్ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిని మిగతా కంపెనీలు, బిజినెస్ మెన్స్ ఈజీగా తీసుకున్నారు. కానీ కోలుకోలేని దెబ్బ తీశారు అంబానీ. కేవలం వెయ్యి రూపాయలకే మొబైల్ ఫోన్ ఆఫర్ ప్రకటించారు. అప్పట్లో అదో సంచలనం. ప్రతి కంపెనీ రిలయన్స్ ను ఢీకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మార్కెట్ స్ట్రాటజీలు అన్నీ ఒకదాని వెంట ఒకటి పోటీ పడ్డాయి. కానీ ఇప్పటికీ తన రూపు రేఖలను మార్చుకుంటూ రిలయన్స్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ఆ తర్వాత డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ కూడా తన హవా కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే ముఖేష్ తన కూతురు, కొడుక్కి టెలికాం, ఆయిల్ కంపెనీల బాధ్యతలను అప్పగించారు.
చూస్తే చిన్నవాళ్లయినా ..గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. యూత్‌ను, ఇండియన్స్ ను టార్గెట్ చేశారు. తక్కువ డబ్బులకే డేటా, ఫోన్, వాయిస్ కాల్స్ ఇస్తున్నట్లు ముంబయిలో ప్రకటించారు. అదే రిలయన్స్ జియో. భారతీయ చరిత్రలో..ముఖ్యంగా టెలికాం రంగంలో ..సంచలనాత్మక నిర్ణయంగా భావించాలి. దేశంలోని ప్రతి మారుమూల పల్లెలో రిలయన్స్ ఉంటుంది. ఆ దిశగా కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇక మిగిలింది మాతో పోటీ ఏ కంపెనీ పడలేదు. మా పోటీ మాతోనే ..ఇంకెవ్వరూ ..ఏ కంపెనీ మా దరిదాపుల్లోనే లేరంటూ ముఖేష్ కూతురు స్పష్టం చేసింది. ఆమెకు అనుభవం లేదని..ఆమె వ్యాఖ్యలను తీసి పారేశాయి మిగతా కంపెనీలు. టెలికాం కంపెనీల్లో పెద్ద వాటా కలిగిన ఎయిర్‌టెల్ కుప్ప కూలిపోయింది. వొడాఫోన్ అడ్రస్ కనిపించడం లేదు. ఐడియా ఊసురుమంటోంది. 5 కోట్ల మంది రిలయన్స్ లో వినియోగదారులుగా చేశారు.
ఇపుడు ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది రిలయన్స్ కస్టమర్లే ఉన్నారంటే దాని పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ ఫర్నీచర్, ట్రెండ్స్, డిజిటల్ వస్తువుల అమ్మకాలు, ఇలా ప్రతి రంగంలోకి ఎంటరైంది. ఇండియాలోని వ్యాపారమంతా పల్లెల్లో ఉంటోంది. ఈ విషయాన్ని గమనించిన రిలయన్స్ ..ఏకంగా చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తోంది. ఏపీలో ఇప్పటికే చౌకధర దుకాణాలను టేకోవర్ చేయాలని అనుకుంటోంది. అమెరికా కంపెనీ చిరు దుకాణాలతో అనుసంధానం కావాలని అనుకుంటే ..రిలయన్స్ మాత్రం కోట్లాది దుకాణాలను డిజిటలైజేషన్ చేసి..వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆ దిశగా చాప కింద నీరులా పావులు కదుపుతోంది. రాను రాను ఇండియా అంటే రిలయన్స్..రిలయన్స్ అంటే ఇండియా అన్న రీతిలో మారిపోతుందేమోనని ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు కంపెనీ కన్ను వ్యవసాయ రంగం మీద పడనందుకు ఆనందపడాలి మనమంతా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి