కోట్లే కోట్లు..బంపర్ ప్రైజులు..భారీ ఆఫర్లు
ఇండియన్ ప్రిమియర్ లీగ్ పుణ్యమా అంటూ కొత్త కుర్రాళ్లు తమ టాలెంట్‌కు పదును పెట్టారు. ఆయా జట్లకు ఫ్రాంచైజీలుగా ఉన్న యాజమాన్యాలు ఒక్కో ఆటగాడిని ఒక్కో రేటు పెట్టి వేలం పాటలో చేజిక్కించుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో 17వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశాన్ని నియంత్రించి..చట్టాలు రూపొందించి..తయారు చేసే అత్యున్నత పార్లమెంట్‌కు పంపించే ఎంపీలు పోటీ చేస్తుంటే జనం స్పందించడం లేదు. యువతీ యువకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇటు వైపు ఎక్కువ మొగ్గు చూపించారు. కారణం క్రికెట్ ఫీవర్ ఇండియాను ఊపేసింది. పడుకోనీయకుండా చేసింది. కంటి మీద కునుకే లేకుండా చేసింది. ఇంతలా ప్రభావితం చేసిన ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్ ఒక్కటే. ఏ గల్లీల చూసినా క్రికెట్టే..ఏ ఇల్లు తలుపు తట్టినా సీరియల్స్ బంద్..సినిమాలు బంద్..అంతటా ఐపీఎల్ మాయాజాలం కమ్మేసింది. అందరినీ తన వైపు తిప్పుకుంది. ఇదీ క్రికెట్ అంటే..దానికున్న పవర్ ఏమిటో రుచి చూపించింది.
టోర్నీలో పాల్గొన్న జట్లు ఫైనల్ వరకు రావాలని పరితపించాయి. శక్తి వంచన లేకుండా పోరాటం చేశాయి. చివరకు ఉత్కంఠ పోరాటానికి తెర పడింది. ఆఖరి అంకం ముగిసింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ ఐపీఎల్ మహాసంగ్రామానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం వేదికగా నిలిచింది. వేలాది మంది క్రికెట్ అభిమానులు స్టేడియంలో కేరింతలు కొట్టారు. క్రికెట్‌ను ఎంజాయ్ చేశారు. ఎక్కడ చూసినా ..ఏ హోటల్ కు వెళ్లినా..టీ కొట్టు దగ్గరున్నా..వైన్స్ షాపులు, పబ్స్, బార్లు , రెస్టారెంట్లు అన్నీ ఐపీఎల్‌తో నిండి పోయాయి. అంతగా ఐపీఎల్ ప్రజలను కట్టి పడేసింది. పోరాటం ముగిసింది..ఒకే ఒక్క పరుగు తేడాతో చెన్నై చేజేతులారా ఓటమిని కొనితెచ్చుకుంది. కానీ ఎందరో ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు.
రేపటి భవిష్యత్ కు బాటలు వేశారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. అది లెక్కలోనికి రానిది. టోర్నీ ముగియడంతో..ఐపీఎల్ నిర్వాహకులు ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా అవార్డులు, ప్రైజ్ మనీలు, పురస్కారాలు ప్రకటించారు. 59 మ్యాచ్‌లు జరిగాయి. విజేతగా నిలిచిన ముంబై జట్టుకు ప్రైజ్ మనీ రూపంలో 20 కోట్లు దక్కగా..రన్నర్ గా నిలిచిన చెన్నై జట్టుకు 12.50 కోట్లు దక్కాయి. ఫెయిర్ ప్లే అవార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుచుకుంది. పర్చుల్ క్యాప్ అంటే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిఎస్‌కే జట్టు ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కు 10 లక్షలు వచ్చాయి. ఆరెంజ్ క్యాప్ అంటే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎస్ ఆర్ హెచ్ ఆటగాడు డేవిడ్ వార్నర్ 10 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు.
అత్యధిక విలువైన ఆటగాడిగా కెకెఆర్ జట్టు క్రికెటర్ ఆండ్రి రస్సెల్ ఎంపికయ్యాడు. ఆయనకు హారియర్ కారుతో పాటు చెక్కు అందజేశారు. దీంతో పాటు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా అందుకున్నాడు. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డును రాహుల్ చాహర్ కు 10 లక్షలు దక్కాయి. స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. ఆయనకు 10 లక్షలు లభించాయి. అత్యంత ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ గా మరో పది లక్షలు దక్కాయి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ..అవార్డును శుభమన్ గిల్ 10 లక్షలు గెలుచుకున్నాడు. పర్ ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును పొలార్డ్ 10 లక్షలు పొందాడు. ఉత్తమ పిచ్‌ల వరకు వస్తే హైదరాబాద్, మొహాలీ ఎంపికయ్యాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి